EPISODE · Dec 15, 2022 · 15 MIN
వీరి మధ్యన ఎపిసోడ్ 12 | Veeri Madhyana Episode 12 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 12 రచన: బివిడి ప్రసాదరావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' చివరి భాగం గత ఎపిసోడ్ లో… గోవా టూర్ వెళ్లాలనుకుంటారు సాహసి, సామ్రాట్ లు. ఇరువైపులా పెద్దలు అంగీకరిస్తారు. ఇక వీరి మధ్యన.. చివరి భాగం చదవండి... మర్నాడు - ఫైవ్ థర్టీటు ఏయం. సాహసి, సామ్రాట్ మోర్నింగ్ వాక్ లో ఉన్నారు. పక్కపక్కగా నడుస్తున్నారు. వాతావరణం చిరు గాలితో చల్లగా ఉంది. వాకింగ్ ట్రాక్, వాకర్స్ తో నిండుగా ఉంది. కానీ ఎవరి సొద వారిదిగా అంతా నడుస్తున్నారు. సాహసి రావడంతో సామ్రాట్ దిన చర్యల్లో మార్పులు వచ్చాయి. అందుకు సాహసి ఒత్తిడి ఏ మాత్రం లేదు. సాహసి కేవలం తన తీరును తాను కొనసాగిస్తుంటే, సామ్రాటే వాటిని గుర్తిస్తూ అటు మొగ్గేశాడు. ఉదయం ఐదింటికి సాహసి సెట్ చేసుకున్న అలారం ధ్వనికి చక్కగా నిద్ర నుండి లేవగలుగుతున్నాడు సామ్రాట్. బాత్రూం పనులు కానిచ్చేసి చకచకా సిద్ధమైపోతున్నాడు. అప్పటికే తయారై తన పనిన తాను కదులుతున్న సాహసిని అనుసరించేస్తున్నాడు. సిక్స్ థర్టీ ఐంది. సాహసి, సామ్రాట్ లు వాకింగ్ నుండి ఇంటికి చేరారు. మైన్ డోర్ లాక్ తీశాడు సామ్రాట్. ఇద్దరూ హాలులోని సోఫాలో కూర్చున్నారు. ఇద్దరూ కొద్దిసేపటిలోనే రిలాక్స్ అయ్యారు. సాహసి కిచిన్ లోకి వెళ్లింది. సామ్రాట్ హాలులోనే ఇంకా కూర్చున్నాడు. కొద్ది నిమిషాల్లో సాహసి తిరిగి అక్కడికి వచ్చింది. తన కుడి చేతి లోని గ్లాసును సామ్రాట్ కు అందిస్తూ, "ఈ రోజు సోరకాయ జ్యూస్." అంది. సామ్రాట్ ఆ గ్లాస్ అందుకున్నాడు. తన ఎడమ చేతిలోని తన గ్లాసును తన కుడి చేతిలోకి మార్చుకొని, సామ్రాట్ పక్కనే సోఫాలో కూర్చుంది సాహసి. "కాఫీ వదిలి ఇలాంటి డ్రింక్స్ డైలీ తీసుకోవడం బాగుంది. థాంక్స్ హసి. మంచి మంచి అలవాట్లును పరిచయం చేశావు." అన్నాడు సామ్రాట్. సాహసి ఏమీ అనలేదు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/SFWaOQgTSD0
Embed this episode
NOW PLAYING
వీరి మధ్యన ఎపిసోడ్ 12 | Veeri Madhyana Episode 12 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.