EPISODE · Oct 16, 2022 · 13 MIN
వీరి మధ్యన... ఎపిసోడ్ 3 | Veeri Madhyana Episode 3 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 3 రచన: బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో... సామ్రాట్ ని కలిసిన రమేష్, సాహసి డిగ్రీలో తన క్లాస్మేట్ అని చెబుతాడు. ఆమె చాలాపొగరుబోతని కూడా చెబుతాడు. జ్వాల అనే అపరిచిత యువతి సామ్రాట్ కి కాల్ చేసి, మాట్లాడుతూ ఉంటుంది. ఇక వీరి మధ్యన.. మూడవ భాగం చదవండి... "గుడ్. నౌ. నువ్వు ఓకే గా." అంది జ్వాల. "ఆ ఆ. హండ్రడ్ పర్సంట్. చెప్పు చెప్పు. చెప్పేయ్." అన్నాడు సామ్రాట్ గమ్మున. "ఏమిటి చెప్పేది." అడిగింది జ్వాల. "అదేమిటి. నువ్వు చెప్పింది చేస్తే, నీ గురించి చెప్తాను అన్నావుగా." అన్నాడు సామ్రాట్. "నో." అంది జ్వాల. "వాట్. ఈ తిరకాసేమిటి." అన్నాడు సామ్రాట్ గోలగా. "తిరకాసు లేదు, సర్కాస్ లేదు. నేనేమన్నాను. నా ప్రశ్నకు జవాబు ఇస్తేనే, నా గురించి చెప్పుతాను అన్నాను. గుర్తు తెచ్చుకో." చెప్పింది జ్వాల. "సరే తల్లీ. అలాగే తగలడు." అన్నాడు సామ్రాట్ విసురుగా. "హేయ్. మళ్లీ టెన్షన్ అవుతున్నావు. మళ్లీ నేను చెప్పిన ప్రక్రియ చేయాలి." అంది జ్వాల. "అమ్మో. తల్లీ. నేను కూల్ గానే ఉన్నా. ఆ ప్రశ్న ఏదో అడిగేయవా. ప్లీజ్." అన్నాడు సామ్రాట్ మెల్లి మెల్లిగా. జ్వాల మాట్లాడలేదు. సామ్రాట్ తన ఫోన్ ని చెవి దరి నుండి ముందుకు తెచ్చుకొని దానిలోకి చూశాడు. కాల్ టైం జరుగుతుంది. వెంటనే తిరిగి చెవి దరిన ఫోన్ పెట్టుకొని, "ప్లీజ్." అన్నాడు. "నన్ను ప్రేమిస్తావా." ప్రశ్నించేసింది జ్వాల. సామ్రాట్ గతుక్కుమన్నాడు. అర నిమిషం పిమ్మట, "బోలో జీ." అంది జ్వాల. సామ్రాట్ మాట్లాడలేక పోతున్నాడు. "స్పృహలో ఉన్నావా. పడ్డావా." అంది జ్వాల. అప్పటికీ జవాబు లేక పోయే సరికి, "సామ్రాట్." అంది జ్వాల కాస్తా తికమకగా. మూడు మార్లు జ్వాల తనని పిలవగా, తేరుకుంటూ, "ఏమిటీ నీ ధోరణి. నాకు బోధ పడుట లేదు." చెప్పాడు సామ్రాట్. "ఏముంది. డొంక తిరుగుడు లేకుండా అడిగాగా." అంది జ్వాల. "ఏమడిగావు." సామ్రాట్ అన్నాడు విసురుగా. "నన్ను ప్రేమించమని." చెప్పింది జ్వాల నెమ్మదిగా. "నేను నిన్ను ప్రేమంచడం ఏమిటి. కుదరని పని." చెప్పేశాడు సామ్రాట్. "ఎందుకు కుదరదు. నాకు నీ గురించి అంతా తెలుసు. నువ్వు నౌ 'బేచిలర్' వే గా." అంది జ్వాల. "ఐతే, ప్రేమించేయాలా." అడిగాడు సామ్రాట్ విసురుగా. "ఆ. నువ్వు నన్ను చూస్తే, మరో మాట ఆడవు. క్షణం ఆగక, నువ్వే, నన్ను అడిగేస్తావ్, నిన్ను ప్రేమించమని." చెప్పింది జ్వాల. "ఏం. అంత కాన్ఫిడెన్స్ ఏమిటో. నువ్వు ఏమైనా జిగేల్ రాణివా." అన్నాడు సామ్రాట్... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/DVQU9Qkdi3A
Embed this episode
NOW PLAYING
వీరి మధ్యన... ఎపిసోడ్ 3 | Veeri Madhyana Episode 3 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.