EPISODE · Oct 16, 2022 · 14 MIN
వీరి మధ్యన ఎపిసోడ్ 4 | Veeri Madhyana Episode 4 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 4 రచన: బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… తనను ప్రేమించమంటుంది జ్వాల. సామ్రాట్ అందుకు అంగీకరించడు. త్వరలో అతని ఎదుటికి వస్తానని చెబుతుంది జ్వాల. ఇక వీరి మధ్యన.. నాలుగవ భాగం చదవండి... సామ్రాట్ మెల్లిగా, "ఎందుకు." అన్నాడు. "మన మధ్య ఇట్టి చిలిపితనం ఉంటే, భలే మజా కదూ." అంది సాహసి ముచ్చటగా. "థాంక్స్. నువ్వు నా మాటలకి హర్ట్ అయ్యావనుకున్నాను." చెప్పాడు సామ్రాట్. "అయ్యో మహానుభావా. నన్ను మరీ గయ్యాళి అనుకుంటున్నావా, ఏంటీ." అంది సాహసి. "అబ్బెబ్బే. అలా అనుకోకు. జస్ట్ నెర్వ్స్ అయ్యా. అంతే." చెప్పాడు సామ్రాట్. "చాల్లే. నువ్వు మరిన్నూ." అంది సాహసి మురిపెంగా. "సాహసి." అన్నాడు సామ్రాట్. "మరోలా పిలు." చెప్పింది సాహసి చిలిపిగా. సామ్రాట్ వెంటనే ఏమీ అనలేదు. "మహానుభావా. నన్ను సాహసి కాక, మరోలా పిలు అంటున్నాను." చెప్పింది సాహసి. "ఉ. ఊ. ఎలా. అ. సాహ." అన్నాడు సామ్రాట్. "ఉహు. ఇంకా.. వేరేలా." అంది సాహసి. "హసి." అనేశాడు సామ్రాట్. "బాగుంది. బాగుంది కదూ. నువ్వు ఏమంటావు." అంది సాహసి హుషారుగా. "నీకు నచ్చిందా." అడిగాడు సామ్రాట్. "బాగా. ఇకపై నన్ను అలానే పిలుస్తుండు. ప్లీజ్." చెప్పింది సాహసి. "తప్పక హసి." చెప్పాడు సామ్రాట్ ఉత్సాహంగా. "థాంక్యూ వెరీ మచ్." అంది సాహసి నిండుగా. "మరి నన్ను నువ్వేలా పిలుస్తావు." అప్పుడే అడిగేశాడు సామ్రాట్. "చెప్పనా. ఎప్పుడో ఆలోచించి పెట్టుకున్నాను." చెప్పింది సాహసి. "చెప్పవా." అడిగాడు సామ్రాట్ కుతూహలంగా. "చెప్పేయనా." అంది సాహసి ఊరిస్తున్నట్టు. "చెప్పవా." అన్నాడు సామ్రాట్ మెలికలు తిరిగి పోతూ. "ఇప్పుడు కాదు." టక్కున అంది సాహసి. "అబ్బా." అన్నాడు సామ్రాట్ నీరు కారిపోయేట్టు. "చెప్తాలే." అంది సాహసి. "ఎప్పుడు." అడిగాడు సామ్రాట్. "ఉ. అట్టి సమయం రానీ." చెప్పింది సాహసి చిలిపిగా. "ఛీటింగ్. నువ్వు నాతో చెప్పించుకున్నావు." అన్నాడు సామ్రాట్ ఉడికిపోతూ. "నువ్వు నన్ను పేరుతో తొలుత పిలిచింది ఇప్పుడేగా. అందుకే నేను కోరి మార్పించుకోగలిగాను." చెప్పింది సాహసి. ఫోన్ ని రెండో చెవి వైపుకు మార్చుకొని, "అబ్బా. నువ్వు మరిన్నూ." అనేశాడు సామ్రాట్.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/ckJSEDG-izs
Embed this episode
NOW PLAYING
వీరి మధ్యన ఎపిసోడ్ 4 | Veeri Madhyana Episode 4 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.