EPISODE · Nov 16, 2022 · 14 MIN
వీరి మధ్యన ఎపిసోడ్ 8 | Veeri Madhyana Episode 8 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 8 రచన: బివిడి ప్రసాదరావు బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' ఎనిమిదవ భాగం గత ఎపిసోడ్ లో… సేల్స్ గర్ల్ గా వచ్చిన ఆమె తనతో ప్రవర్తించిన తీరును సాహసితో చెబుతాడు సామ్రాట్. అతని నిజాయితీకి సంతోషిస్తుంది సాహసి. ఆ సేల్స్ గర్ల్, సామ్రాట్ ని పరీక్షించడానికి తాను ఏర్పాటు చేసిన వ్యక్తి అనే విషయం అతని ముందు అంగీకరిస్తుంది. స్నేహితుల పెళ్లికోసం ఇద్దరూ తిరుమల వెళ్తారు. ఇక వీరి మధ్యన.. ఎనిమిదవ భాగం చదవండి... "ఈ టైంకి నాకు టీ పడాలబ్బా." అన్నాడు సామ్రాట్ గుణుస్తూ. "ఓకే బాబూ. నువ్వు తెప్పించుకో." అంది సాహసి చొరవగా. "నిన్ను ఎదురుగా పెట్టుకొని ఒంటరిగా తాగడమా. నో. వద్దులే." అనేశాడు సామ్రాట్ సరదాగా. "కాదు బాబూ. తెప్పించుకో" చెప్పింది సాహసి. "ఒక పని చేస్తా. టీ తెప్పించుకుంటా. నీకు కొద్దిగా షేర్ చేస్తా." చెప్పాడు సామ్రాట్. "మొండిగా అగుపిస్తున్నావు. సర్లే. కానీ." అనేసింది సాహసి. బోయ్ ని పిలిచి, "ఒక టీ. ఒక ఖాళీ గ్లాస్." చెప్పాడు సామ్రాట్. సామ్రాట్ ని ఎగదిగా చూసి వెళ్లి పోయాడు బోయ్. "ఒన్ బై టూ అనవలసింది." అంది సాహసి. తను బోయ్ చేష్టని చూసింది. "అబ్బే. ఐ వాంట్ సమ్ థ్రిల్." అన్నాడు సామ్రాట్ నవ్వేస్తూ. సాహసి కూడా నవ్వేసింది. పావు గంట పిదప, కాఫీ కేఫ్ నుండి ఆ ఇద్దరూ బయటికి వచ్చారు. తిరిగి తమకు కేటాయించిన వసతుల వైపు నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. "ఆ జ్వాలను లంచ్ టైంలో చూశాను. తను ఈ పెళ్లికే వచ్చినట్టు ఉంది." చెప్పాడు సామ్రాట్. "మరి. తనూ కవితకు తెలిసిందే." చెప్పింది సాహసి. ఆ వెంబడే, "ఏం. ఏమైనా మాట్లాడిందా." అడిగింది. "అబ్బే. నన్ను చూస్తూనే చరచరా ఎటో వెళ్లి పోయింది." చెప్పాడు సామ్రాట్ నవ్వుతూ. సాహసి నవ్వుకుంది. తర్వాత, ఆ ఇద్దరూ విడిపోయి, ఎవరి తోవన వారు నడిచారు. డిన్నర్ సమయంలో సాహసి, సామ్రాట్ లు ఒకర్ని ఒకరు చూసుకున్నారే తప్పా, మాట్లాడుకునే అవకాశం వాళ్లకి చిక్కలేదు. పెళ్లి మండపంలో, వేదిక మీద, కవిత పక్కకి సాహసి, రమేష్ పక్కకి సామ్రాట్ చొరవగా చేరిపోయి, ఇద్దరూ అక్కడ చక్కగా, చలాకీగా మెసులుకున్నారు. కవిత, రమేష్ ల పెళ్లి ముచ్చటగా ముగిసింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ErrUWT7W6Go
Embed this episode
NOW PLAYING
వీరి మధ్యన ఎపిసోడ్ 8 | Veeri Madhyana Episode 8 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.