వీరి మధ్యన ఎపిసోడ్ 9 | Veeri Madhyana Episode 9 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com  episode artwork

EPISODE · Nov 23, 2022 · 14 MIN

వీరి మధ్యన ఎపిసోడ్ 9 | Veeri Madhyana Episode 9 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 9 రచన: బివిడి ప్రసాదరావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బివిడి ప్రసాదరావు గారి  ధారావాహిక 'వీరి మధ్యన..' తొమ్మిదవ భాగం గత ఎపిసోడ్ లో… విజయవాడలో ఉన్న సామ్రాట్ మేనత్త మరణిస్తుంది. సామ్రాట్, సాహసిల పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. పెళ్లి వాయిదా వేయవద్దని సాహసి తల్లిదండ్రులతో పాటు, సామ్రాట్ కూడా అభ్యర్థిస్తాడు. అందుకు అంగీకరిస్తాడు సామ్రాట్ తండ్రి గోపాలస్వామి. సాహసి, సామ్రాట్ ల వివాహం జరుగుతుంది. ఇక వీరి మధ్యన..   తొమ్మిదవ  భాగం చదవండి... ఆ ఇద్దరి మధ్య మంచి పరిచయం ఉంది. బాగా చనువు ఉంది. బ్యాంక్ లో లంచ్ ఇద్దరూ కలిసే చేస్తుంటారు. వీక్ ఎండ్స్ లో ఇద్దరూ కలిసే షాపింగ్ చేస్తుంటారు. వ్యక్తిగత ముచ్చట్లు బిడియం లేకుండా ముచ్చటించుకుంటారు. ఫ్రెండ్స్ లా మెసులుకుంటారు. చంద్రికకు పెళ్లైంది. ఆమె భర్త లోకల్ ప్రయివేట్ కాలేజీలో లెక్చరర్. వాళ్లకు రెండేళ్ల బాబు ఉన్నాడు. చంద్రిక, ఆమె భర్త జాబ్ లకు వెళ్తుంటే, వాళ్ల బిడ్డ సంరక్షణ, ఇంటి పరివేక్షణ చంద్రిక అత్తమామలు చక్కదిద్దుతున్నారు ఎంచక్కా. సాహసి చెప్పిందంతా విన్న చంద్రిక, "అవునా. ఈ ఆషాఢ మాసం రోజులు ఇక్కడే జాబ్ చేయాలనుకుంటున్నావా. నిజానికి నా రిక్వెస్ట్ తో హెడాఫీస్ లో నాకున్న పరిచయాలతో, నీ ట్రాన్స్ఫర్ కు సహకరించగలుగుతున్నాను. సికింద్రాబాద్ బ్రాంచ్ కు రానున్న ఫస్ట్ తారీఖుకు నువ్వు వెళ్లాలి. మళ్లీ రిక్వెస్ట్ పెడితే, ఆ సికింద్రాబాద్ బ్రాంచ్ లో  ఉన్న ఆ వెకెంట్ ను ఇంకా కొన్నాళ్ల పాటు కొనసాగించ లేరు. ఆ బ్రాంచ్ మేనేజర్ ఆ వెకెంట్ ను భర్తీ చేయమని బాగా ఒత్తిడి చేస్తున్నాడట." చెప్పింది. సాహసి మాట్లాడలేక పోతుంది. "అన్నట్టు. సికింద్రాబాద్ బ్రాంచ్ దగ్గరన మీ వారు పోర్షన్ తీసి పెట్టారని చెప్పావుగా. మరేంటి ప్రొబ్లమ్. అక్కడికి నువ్వు వెళ్ల వచ్చుగా. మీ ఆయన నువ్వు అక్కడ ఉండొచ్చుగా. పైగా మీ అత్తవారు వేరేగా ఉంటున్నారుగా." అంది చంద్రిక చకచకా. సాహసి గమ్మున మాట్లాడలేక పోతుంది. చంద్రికనే చూస్తూ ఉండిపోయింది. "ఏంటాలా చూస్తున్నావ్." అడిగింది చంద్రిక. "మరే. అదే అదే. మా వాళ్లతో అదే చెప్పాను. కానీ వాళ్లు కుదరదన్నారు." చెప్పింది సాహసి. "ఏం." అంది చంద్రిక విస్మయంగా. "మరే. మాకు ఇంకా శోభనం కాలేదు." చెప్పగలిగింది సాహసి. "వాట్. అదేంటి. పెళ్లి తర్వాత పదహారు రోజుల పండగలో అదొక వేడుకగా. అలా కాకపోవడమేంటి." అంది చంద్రిక చిత్రంగా. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/cmDAHF6sWco

Episode metadata supplied by the publisher feed · Published Nov 23, 2022

Embed this episode

NOW PLAYING

వీరి మధ్యన ఎపిసోడ్ 9 | Veeri Madhyana Episode 9 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

0:00 14:32

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 23, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!