EPISODE · Dec 29, 2022 · 23 MIN
విజయనగర సామ్రాజ్యానికి అంకురార్పణ | Vijayanagara Samrajyaniki Ankurarpana | Telugu Short story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) విజయనగర సామ్రాజ్యానికి అంకురార్పణ రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథాపఠనం: కే. లక్ష్మి శైలజ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఒక మహా ముఖ్యమైన రాత్రి పండుగ వస్తుంది. అదే మహాశివరాత్రి. అది హిందువులందరికీ మహా పవిత్రమైన పర్వదినం. ఆనాడు హిందువులందరూ పిన్నలు, పెద్దలు, వృద్దులూ, స్త్రీలూ, పురుషులూ- పూజలు, పునస్కారాలూ, జపాలు, తపాలు, యజ్ఞయాగాదులు మొదలగు పుణ్యకార్యము లెన్నింటినో చేస్తూ పరమశివువి పూజిస్తారు. అది హిందువుల కొక్కరికే చెందిన పండుగ కాదు. సకల మానవాళికి మహా పుణ్యదినము. మానవులకే కాక కిన్నరులు, కింపురుషులు, సిద్దులు, సాధ్యులు, యక్ష, గంధర్వ, విధ్యాధరాది సర్వులానాడు సర్వేశ్వరుడగు ఈశ్వరుని ఆరాధిస్తారు. నిర్మల మనస్కులైన భక్తులను, బీద నారాయణలకు దానధర్మములను చేసిన ధార్మికులను, పరమేశ్వరుడు ఆనాడు చిదానందము, కోటి సూర్య ప్రభా సమాన తేజోమూర్తియై నిజరూపముతో అనుగ్రహిస్తాడు. ఈ కలియుగమునందు పదమూడవ శతాబ్దిలో అటువంటి మహాశివరాత్రి పర్వ దినమున ఒక శివరాత్రి సమయాన శ్రీభువనేశ్వరీమాత హేమకూటాద్రి శిఖరము మీదకు వేంచేసినది. మహాధ్యాన సమాధి నిష్టయందున్న శ్రీవిరూపాక్షస్వామి ని చూసింది. శ్రీ విరూపాక్షుడు ఆమె ఏమైనా ముఖ్యమైన పనిమీద వచ్చిందేమోనని దివ్యదృష్టి చేత తెలిసినవాడైనను, వెంటనే కండ్లు తెరువలేదు. పెదవి విప్పి మాట్లాడలేదు. కొద్ది సేపైన తరువాత శ్రీవిరూపాక్షులు కండ్లు తెరచి చూసేటప్పటికి ఎదుట శ్రీభువనేశ్వరీమాత నిమీలిత నేత్రయై ధ్యాన నిమగ్నయై వెలుగొందు చుండెను. ఆమెను ఆ స్థితిలో చూడడం శ్రీవిరూపాక్షులకు ఎంతగానో ఆనందమైంది. "భువన" అని ప్రేమగా పిలిచి ఆమెను ఆ స్థితిలో నుండి మేల్కొలిపాడు. శ్రీవిరూపాక్షుల పిలుపు విని శ్రీభువనేశ్వరి కన్నులు తెరచి చూచి భక్తి గౌరవములతో అంజలి ఘటించినది. విరూపాక్షస్వామి చిరునవ్వుతో "భువనా! ఈ నాడిలా కళావిహీనవై వుండుటకు కారణమేమిటీ? ఎల్లప్పుడు చిరునగవు చిందులాడు నీ మోమేలకో వన్నె తరిగి చిన్నబోయెను. ఏదియో నొక విషయము క్లిష్టమునైన సమస్య నీ మనమున నిలిచి, నిన్ను బాధించుచున్నదియో? దానిని గురించి తీవ్రముగా ఆలోచించుచుంటివో? నాకు తెలియజెప్పుము" అన్నాడు.. శ్రీభువనేశ్వరి ఆ వాత్సల్యపూరిత వాక్కులకు ఆనందించిన, విచారగ్రస్తమైన వదనంతో " స్వామీ! ఏమని చెప్పను నా బాధ. భూలోకమున ప్రజలు నీతి న్యాయములు పాటింపక, దుష్టకార్యములను చేయుచూ పాపగ్రస్థు లై జీవిస్తున్నారు. ఇది నా కెంతో బాధను కలిగిస్తున్నది" అన్నది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Embed this episode
Ready to play
విజయనగర సామ్రాజ్యానికి అంకురార్పణ | Vijayanagara Samrajyaniki Ankurarpana | Telugu Short story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.