వినిపించని రాగాలు 10 | Vinipinchani ragalu 10 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com episode artwork

EPISODE · Mar 4, 2023 · 13 MIN

వినిపించని రాగాలు 10 | Vinipinchani ragalu 10 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 10 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కుమార్ ఏపరిస్థితులకి లొంగిపోయాడో, ఎవరి మాటల ప్రభావంలో పడి ఇలా ప్రవర్తించాడో అని ఏదో మూల అనిపిస్తుంటే వదులుకోలేక ఇక్కడిదాకా తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నాను. కోలుకున్నాకైనా మంచి మనిషిగా నా మనిషిగా మారతాడని ఆసించాను. ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది" అంది రజిత. "హు.. పనికిరాని శరీరం మీద కూడా ఆత్మకి భ్రాంతి చావదుట. ఎంత తొందరగా ఆ శరీరాన్ని పూడ్చడమో, కాల్చడమో చేస్తేనేగానీ ఆ ఆత్మకి విముక్తి దొరుకుతుందిట. అందుకే కడుపులో బిడ్డని తీసినపుడే నా మనసులోంచి కుమార్ ని కూడా తీసేసాను. ఇప్పుడు వాస్తవంలో బతుకుతున్నాను" అంది స్వప్న. "మనిషి గుణాలను బట్టే జాతకాలు నిర్ణయించబడతాయేమో. నేనొకందుకు చెబితే అదొకందుకు జరిగింది. పరిస్థితులకీ, బుద్ధికీ మధ్య సంఘర్షణ ఎదురైతే సంస్కారాన్ని మేల్కొల్పి, జరగబోయే దారుణాల్ని ఆపచ్చనే ఉద్దేశ్యంతో చెప్పాను. ఆరోజు నా ఏకైక లక్ష్యం భర్త లేని ఆమెకు ఒక తోడు దొరుకుతుందని. కానీ నీ జీవితంలోకొచ్చి ఇంత కల్లోలం సృష్టిస్తాడనుకోలేదు. ఈ అవకాశవాది కోసం నీ బతుకుని పాడుచేసుకోకు. జీవితం భగవంతుడు మనకిచ్చిన బహుమానం. మనమే దాన్ని అపురూపంగా మలుచుకోవాలి. అపశృతులను సరిచేసుకుంటూ కలల రెక్కల్ని సవరించుకోవాలి. ఉన్నచోటే ఉండిపోతే మహానదికీ, బురదగుంటకీ తేడా ఏముంది? నీ సంస్కారం, నీ విలువలూ నీ వెంట ఉన్నంతవరకూ నిన్ను ఏ జాతక చక్రాలూ ఏం చెయ్యలేవు. హాయిగా బతికేందుకు మరోచల్లని చోటు చూసుకో. జరిగింది పీడకలలా మర్చిపోయి ఈ అధ్యాయాన్ని ముగించి, కొత్త జీవితాన్ని ఆహ్వానించు. వెళ్ళు రజితా. తెలిసో తెలియకో నా వలన నీకు నష్టం జరిగింది. మా నాన్న వలన నీ జీవితం నిలబడింది. ఆయన చేసింది ఆ సమయంలో సరైనదే. అయినా అది రికార్డులకెక్కని నేరం. వీటన్నిటి పరిహారం ఒక్కటే. కుమార్ వైద్య ఖర్చులు నేను భరిస్తాను. వాడు చేసిన తప్పులకు శిక్షాకాలం పూర్తయ్యేదాకా ఆ కోమానే వాడికి తోడు." అన్నాడు మధు. "మధూ, నిన్ను అపార్ధం చేసుకుని నా మాటలతో బాధపెట్టాను. నువ్వు కూడా తండ్రికి తగ్గ కొడుకువి అనిపించుకున్నావు. ఒకరకంగా మా ఇద్దరి జీవితాల్నీ నువ్వే కాపాడావు. జాతకంలో జరగబోయేది తెలుసుకుని బతుకుని మంచిగా మలుచుకోమని నీలాంటి వాళ్ళు చెప్పే హెచ్చరికల్ని తప్పుగా అర్ధం చేసుకున్నవాళ్ళు, వాళ్ళతోపాటు ఇతరుల జీవితాల్ని కూడా కష్టాల్లో పడేస్తారు. శాస్త్రాన్ని నేను గౌరవిస్తాను. " అంది రజిత. ఇంతలో నర్స్ రూమ్ లోకి వచ్చింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/abJsBs2YIhs

Episode metadata supplied by the publisher feed · Published Mar 4, 2023

Embed this episode

Ready to play

వినిపించని రాగాలు 10 | Vinipinchani ragalu 10 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com

0:00 13:12

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on March 4, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!