EPISODE · Jan 11, 2023 · 18 MIN
వినిపించని రాగాలు 2 | Vinipinchani ragalu 2 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 2 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో తన కాలేజ్ మేట్ రజిత హఠాత్తుగా తన ఇంటికి వస్తానని చెప్పడంతో ఆశ్చర్య పోతాడు మధు. బస్టాండుకు వెళ్లి ఆమెను రిసీవ్ చేసుకుంటాడు. సమయానికి అతని భార్య వూళ్ళో లేకపోవడంతో మానసికంగా కాస్త హైరానా పడతాడు. హాస్పిటల్ లో ఉన్న తన పెదనాన్నని చూడడానికి వచ్చినట్లు చెబుతుంది రజిత. ఇక వినిపించని రాగాలు 2 వ భాగం చదవండి… "అరె అక్కడే ఆగిపోయావే? లోపలికిరా. మొహమాట పడకు. " అన్నాడు మధు. రజిత ఏదో అనబోయి ఆగిపోయింది. ఇల్లంతా పరికిస్తూ మెల్లగా లోపలికి వచ్చింది "అటువైపు బాత్రూమ్. వెళ్లి ఫ్రెష్ అయి రా. " అన్నాడు. టవల్ తీసుకుని వెళ్లి ప్రెషప్ అయి వచ్చి కూర్చుంది. ఆమె దృష్టంతా గోడకి తగిలించివున్న ఫోటోల మీదే ఉంది. "ఏం తాగుతావ్? టీ కాఫీ?" "టీ ఇవ్వు" అంది. రెండు కప్పులతో టీ కలుపుకొచ్చాడు మధు. రజితకి ఓ కప్పిచ్చి ఆమె ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. రజిత వస్తూనే ఇంటికి కొత్త శోభ తెచ్చింది. ఆమె ఒంటిని అంటిపెట్టుకున్న సెంటు పరిమళం ఇల్లంతా గుమ్మెత్తింది. ఆమె చూడ్డానికి పురివిప్పిన నెమలిలా అనిపించింది మధుకి. "ఏంటి రజితా, వచ్చిన దగ్గర్నుంచీ ఆ ఫోటోల వంకే చూస్తున్నావ్. అంత నచ్చాయా?" అన్నాడు మధు టీ సిప్ చేస్తూ. "ఆ ఫొటోలో కుడివైపున ఉన్నదెవరు?" "ఆయన మా నాన్నగారు. . " " ఇప్పుడు ఏం చేస్తున్నారు?" "ఆయన రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్. పదిహేనేళ్ల క్రితం పాకిస్తాన్ వార్ లో ఆయన కుడి చెవి, కన్ను కాస్త దెబ్బ తిన్నాయి. సరిగా పనిచేయవు. ప్రస్తుతం ఇంటిపట్టునే వుంటున్నారు" అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/3nd8vjKAXBw
Embed this episode
Ready to play
వినిపించని రాగాలు 2 | Vinipinchani ragalu 2 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.