EPISODE · Jan 26, 2023 · 16 MIN
వినిపించని రాగాలు 4 | Vinipinchani ragalu 4 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 4 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో ప్రహరీ గోడకు ఆవలి వైపు ఉన్న చెట్టు ఆకతాయిలు చేరడానికి అవకాశంగా మారుతుంది. దాంతో ఆ చెట్టును కొట్టేస్తే బాగుంటుందని ఆవేశంలో అంటాడు మధు. వాచ్మెన్ ఆ చెట్టును నిజంగానే కొట్టెయ్యడంతో బాధ పడతాడు. ఉరికి వెళ్లిన మధు కుటుంబ సభ్యులు తిరిగి వస్తారు. ఇక వినిపించని రాగాలు 4 వ భాగం చదవండి… సత్య మాటలకి తత్తరపడ్డాడుమధు. భార్యకి భయపడేది ఒకే ఒక్క విషయంలో. అతనికి వచ్చే లేడీ ప్యాన్స్ రాసే ఉత్తరాల గురించి. ఎప్పుడో ఒకసారి అలా జరిగింది. జాతక ప్రభావం మనుషులపై ఎలా ఉంటుంది? ఉండబోతుంది ఇలాంటి విషయాలు ఒక ప్రముఖ వీక్లీ లో అచ్చు వేస్తామని అడిగారు. మధు అన్ని రాసుల వారి జాతక చక్రాల వారి గురించీ, జరగబోయే పరిణామాల గురించి వాళ్ళకి రాసిచ్చాడు. అందులో కొన్ని అనుకూల ఫలితాలూ, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అది చదివిన ఆడవాళ్లు వాళ్ళ సందేహ నివృత్తికై అదనపు సమాచారం కోరుతూ అతని అడ్రెస్ కి ఉత్తరాలు రాశారు. పత్రికవారు పాఠకుల ఒత్తిడి మేరకు అడ్రెస్ ఇచ్చి ప్రోత్సహించారుట. ఆ ఉత్తరాలను చదివిన సత్య అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. 'మా వారిని పర స్త్రీ వ్యామోహం కాస్త తగ్గించుకుంటే మంచిది' అని రాశారుకదా. ఆయనకి ఆ వ్యామోహం నిజంగా ఉందా? ఉందని ఎలా తెలుసుకోవడం? ఒకవేళ ఉంటే దాన్ని ఎలా నియంత్రించాలో ఉపాయం చెప్పండి"అని ఒకళ్ళు.. ఇంకోళ్లయితే ఏకంగా 'మా ఆయనకు వృత్తి వ్యాపారాలలో నష్టం వస్తుందని రాశారు. వృత్తిలోనా? లేక వ్యాపారంలోనా? మీరు సరిగ్గా చెప్పలేదు. మీ అడ్రెస్ చెబితే మీ ఇంటికొచ్చి మా సందేహానివృత్తి చేసుకుంటాం' అని. ఏదో ఉజ్జాయింపుగా అన్ని నక్షత్రాల వారికీ కలిపి చెప్పేస్తే వాటి గురించి ఉత్తరాలు రాసేవాళ్ళు ఎక్కువయ్యారు. అప్పటినుంచి ఆ పత్రిక్కి రాయడం మానేశాడు. అయినా ఉత్తరాల పరంపర కొన్నాళ్ళు కొనసాగింది. అందులో ఎక్కువమంది మహిళలే. అందులో అతని ప్రమేయం లేదని పూర్తిగా నిర్ధారణ చేసుకునేదాకా సత్య అతన్ని వదిలిపెట్టలేదు. "ఏంటి ఆ కాగితం?" అన్నాడు సందేహంగా సత్య మొహంలోకి చూస్తూ. "శ్రీవారికి ప్రేమలేఖ" అంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/sgD2gAtuUZA
Embed this episode
Ready to play
వినిపించని రాగాలు 4 | Vinipinchani ragalu 4 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.