EPISODE · Feb 3, 2023 · 16 MIN
వినిపించని రాగాలు 5 | Vinipinchani ragalu 5 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 5 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ... మధు భార్యాపిల్లలు ఊరెళ్ళి ఉంటారు. ఆ సమయంలో అతని క్లాస్మేట్ రజిత అతని ఇంటికి వస్తుంది. హాస్పిటల్ లో ఉన్న తన పెదనాన్నని చూడడానికి వచ్చినట్లు చెబుతుంది రజిత. రజిత, గోడకు తగిలించి తన తండ్రి ఫోటో వంక తదేకంగా చూడడం గమనించాడు మధు. అతని దగ్గర సెలవు తీసుకొని హాస్పిటల్ కు వెళుతుంది రజిత. తన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్న రాజేష్ కష్టాల్లో పడ్డం తెలిసి బాధ పడతాడు మధు. మధు ఇంటి ప్రహరీ గోడకు ఆవలి వైపు ఉన్న చెట్టు ఆకతాయిలు చేరడానికి అవకాశంగా మారుతుంది. దాంతో ఆ చెట్టును కొట్టేస్తే బాగుంటుందని ఆవేశంలో అంటాడు మధు. వాచ్మెన్ ఆ చెట్టును నిజంగానే కొట్టెయ్యడంతో బాధ పడతాడు. ఊరికి వెళ్లిన మధు కుటుంబ సభ్యులు తిరిగి వస్తారు. భార్య చేతికి దొరికిన ఉత్తరం చూసి ఆందోళన పడతాడు మధు. అది మధు చిన్ననాటి స్నేహితుడు సంపత్ కుమార్ జాతకం. అందులో అతనికి భార్య చేతిలో మరణం ఉన్నట్లు ఉంటుంది. ఆ కాగితం రజిత అక్కడ ఉంచినట్లు అనుమానిస్తాడు మధు. రజితకు కాల్ చేసి, ఆమె భర్త పేరు సంపత్ కుమార్ అని తెలుసుకుంటాడు. ఆమెను కలవడానికి ఆమె వెళ్లిన హాస్పిటల్ కి వెళ్తాడు. ఇక వినిపించని రాగాలు ధారావాహిక ఐదవ భాగం చదవండి మధు మనసంతా గందరగోళంగా ఉంది. ఏదో దుశ్శకునంలా అనిపించింది. ఏది ఏమైనా జరిగేదాన్ని నివారించలేం అని సత్య అంటూ ఉంటుంది. కావలసింది కాక తప్పదు. విధే మనల్ని తీసుకువెళుతుంది. చెయ్యటానికీ, చెయ్యకపోవడానికీ మనం ఎవరం అంటూ వేదాంత తత్వాన్ని గురించి వద్దన్నా చెబుతుంది. సత్య అమాయకురాలేం కాదు. తనూ చదువుకుంది. ఫిలాసఫీ ఎం ఏ చేసింది. ‘జీవితాన్ని దానిదారిన దాన్ని పోనివ్వాలి. మనం ఎటో తీసుకెళదాం అని ప్రయత్నిస్తే అది పాదరసంలా చేతికి అందదు సరికదా ముక్కలవుతుంది. జీవితాన్ని సరిగా అర్ధం చేసుకుంటూ అది మనకేం చెబుతోందో గమనించాలి’ అంటూ పెద్ద లెక్చర్లిస్తుంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/RPmmGUeBYlQ
Embed this episode
NOW PLAYING
వినిపించని రాగాలు 5 | Vinipinchani ragalu 5 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.