EPISODE · Feb 8, 2023 · 16 MIN
వినిపించని రాగాలు 6 | Vinipinchani ragalu 6 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 6 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కొద్దిసేపటికి డాక్టర్ వచ్చాడు. అతని వెనకాల పీ జీ స్టూడెంట్స్ కొందరు వున్నారు. వాళ్ళ మెళ్ళో స్టెత్. చేతిలో ఫైల్స్ ఉన్నాయి. నర్స్ కుమార్ బ్రెయిన్ ఎక్సరే ఫిల్మ్ తెచ్చి ఇచ్చింది. డాక్టర్ పైకి పెట్టి చూపిస్తున్నాడు. స్టూడెంట్స్ ఎగబడి చూస్తున్నారు. "చిన్న మెదడుకి దెబ్బతగలటం వల్ల అది వెనక్కి ఒరిగి మెడుల్లా అబ్లంగేట పై పడటం వల్ల మెదడుకు చేరవేసే నరం కట్ అయింది. దానివల్ల ఒత్తిడి పెరిగి బి పీ ఇంక్రీజ్ అయింది” అంటూ మెడికల్ స్టూడెంట్స్ కి కేస్ వివరిస్తూ చికిత్సా విధానాన్ని ఎక్సప్లైన్ చేస్తున్నాడు. డాక్టర్ చెబుతుంటే స్టూడెంట్స్ చకచకా నోట్స్ రాసుకున్నారు. "డాక్టర్, అతనికి ఇప్పుడు ఎలాఉంది? ఏదైనా ఇంప్రూమెంట్ ఉందా?" అడిగాడు మధు. "మీరెవరు?" అన్నాడు డాక్టర్. "పేషేంట్ ఫ్రెండ్ ని. త్వరలోనే కొలుకుంటాడా? మళ్లీ మామూలు మనిషవటానికి ఎన్నాళ్ళు పడుతుంది?" అడిగాడు మధు. "తల వెనక ఏదో బలమైన దెబ్బ తగలటంవల్ల కోమాలోకి వెళ్ళాడు. ఆపరేషన్ చేశాం. పరిస్థితిని మరో నాలుగురోజులు చూసి మరొక ఆపరేషన్ చేయాల్సొస్తుంది. చూద్దాం. " చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. అతని వెనకాలే అందరూ వెళ్లిపోయారు. మధు రజిత వంక చూసాడు. ఆమె కుమార్ వంక చూస్తోంది. మధు కుర్చీలో కూర్చున్నాడు. రజిత కూడా వచ్చి కూర్చుంది. "తల వెనక దెబ్బ ఎలా తగిలింది? యాక్సిడెంట్ జరిగిందా?" " ఇనపరాడ్డుతో కొట్టడం వలన కోమాలోకి వెళ్ళిపోయాడు. " "ఓ మై గాడ్. ఎవరు కొట్టారు? ఎందుకు?" దీర్ఘంగా నిట్టూర్చింది రజిత. చెప్పడం మొదలుపెట్టింది. **** కుమార్ మా పక్కింటి అబ్బాయి. చిన్నప్పటినుంచీ కలిసి పెరిగాం. వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Jl0JqfKsKNo
Embed this episode
NOW PLAYING
వినిపించని రాగాలు 6 | Vinipinchani ragalu 6 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.