వినిపించని రాగాలు 7 | Vinipinchani ragalu 7 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 13, 2023 · 17 MIN

వినిపించని రాగాలు 7 | Vinipinchani ragalu 7 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 7 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మా పెళ్లి ముహూర్తం రాత్రి రెండింటికి. కుమార్ తరపు బంధువులు వచ్చారు. అతని స్నేహితులను కూడా పిలిచాడు. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తరపు పెద్దవాళ్లు కూడా వచ్చారు. పెళ్లి పందిరి మా పెద్ద పెరట్లో ఏర్పాటుచేశారు. మొక్కలన్నీ పీకి చదును చేసి ఎత్తైన మండపం నిర్మించారు. అదంతా పూలతో అలంకరించారు. వచ్చినవాళ్ళందరికీ విడిది మా చుట్టు పక్కల వాళ్ళ ఇళ్లలో ఏర్పాటు చేశారు. ఉదయం నన్ను పెళ్లి కూతుర్ని చేశారు. ఆరోజు భోజనాల దగ్గర అపశృతి చోటుచేసుకుంది. పెళ్లి భోజనం చేసిన అందరూ దాదాపు ఆస్వస్తులయ్యారు. ఏమైందో ఎవ్వరికీ అర్ధం కాలేదు. భోజనం తిన్నవాళ్ళంతా దాదాపుగా వికారం వాంతులాంటి వాటితో చాలా బాధపడ్డారు. కొందరు ముసలివాళ్ళని హాస్పిటల్ లో చేర్చారు. నేనూ, నాతో పాటు కుమార్, మా అమ్మా నాన్నా, వాళ్ళ అమ్మా నాన్నా తప్ప అందరూ ఆ భోజనాన్ని తిన్నారు. తలతిప్పు వికారంతో చాలా మంది విడిదిలో ఉండిపోయారు. పెళ్లి మంటపం దగ్గర ఉన్నవాళ్లు కుమార్ స్నేహితులు, కొద్దిమంది ముఖ్యమైన బంధువులు మాత్రమే. అలా జరిగినందుకు నాన్న చాలా భయపడ్డారు. వీళ్ళలో ఎవరికన్నా జరగరానిదేదైనా జరిగితే అప్రతిష్ట అని ఆందోళనలో వున్నారు. పక్కూరునుంచి వంటవాళ్లను పిలిపించి, పెరట్లో గాడిపొయ్యి తవ్వించి శుభ్రంగా వంటలు చేయించారు. కానీ ఇలా ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. నాన్న భయపడుతుంటే కుమార్ వాళ్ళ నాన్న వచ్చి "ఇదంతా యాదృచ్చికంగా జరిగింది. మన వైపు నీళ్లు వీళ్ళకి అలవాటు లేదు కాబట్టి కాస్త అజీర్తి చేసుంటుంది. మీరేం కంగారు పడకండి బావగారూ. అంతా సర్దుకుంటుంది" అని నచ్చచెప్పారు. అయినా నాన్న మనసు ఏదో కీడు శంకిస్తూనేవుంది. అమ్మ కూడా దిగులుగానే ఉంది. హాస్పటల్ లో చేరిన వాళ్ళ కోసం తోడుగా ఇంకొంతమంది వెళ్లి ఉండిపోయారు. కొందరు విడిదిలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ముహూర్త సమయం సమీపించింది. భజంత్రీలు మోగుతున్నాయి. పౌరోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. మంటపంలోకి పెళ్లి కొడుకు వచ్చాడు. వరపూజ అవుతోంది. ఇంతలో పెద్దగా అరుపులు వినిపించాయి.. 'మెయిన్ ఆపండి.. . మెయిన్ ఆపండి' అని. ఎవరో గభాల్న కరెంట్ మెయిన్ ఆపేశారు. పెళ్లి ఇల్లు మొత్తం చీకటి. పెళ్ళికొచ్చిన కుమార్ స్నేహితుడి తాలూకు ఒక మూసలాయన గోడకి వేలాడుతున్న సీరియల్ లైట్స్ వైర్ మీద చెయ్యి వేసాడు. అది షాక్ కొట్టింది. దాని వైర్ అతని వేలు లోపలికి గుచ్చుకుంది. అది కొద్దిసేపు వదిలి పెట్టలేదు. అతను గిలాగిలా కొట్టుకుంటున్నాడు. ఎవరో అతన్ని పట్టుకుని పక్కకు లాగబోయారు. వాళ్ళకీ షాక్ కొట్టింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/9kMtSL-vpvI

Episode metadata supplied by the publisher feed · Published Feb 13, 2023

Embed this episode

Ready to play

వినిపించని రాగాలు 7 | Vinipinchani ragalu 7 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com

0:00 17:43

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 17 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 13, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!