EPISODE · Feb 19, 2023 · 14 MIN
వినిపించని రాగాలు 8 | Vinipinchani ragalu 8 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 8 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అర్ధరాత్రి.. హోటల్ నిర్మానుష్యంగా ఉంది. క్యారిడార్ లో ఎవరూ లేరు. ఒకరిద్దరు స్టాఫ్ వున్నా వాళ్ళు నిద్రలో జోగుతున్నారు. రిసెప్షన్ లో కూడా ఎవరూ లేరు. మెయిన్ గేటుకు చాలా దూరంగా ఉంది. నేను అక్కడికి పరిగెత్తాను. గేటు మూసి ఉంది. దానికి తాళం వేసి గూర్ఖా కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాడు. గేటు పైకెక్కి దూకాను. కుక్కలు భౌ భౌ మన్నాయి అవేం పట్టించుకోకుండా అక్కడ్నించి పారిపోయాను. చిమ్మ చీకటి. ఎంతదూరం వెళ్ళానో తెలీదు. ఆ కంగారులో ఫోన్ తీసుకురావడం మర్చిపోయాను. నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పే అవకాశం లేదు. రోడ్డు పక్కన ఒక పార్క్ కనిపించింది. గేటు తీసుకుని అందులోకి వెళ్ళాను. ఆయాసంతో నిలబడలేక పోయాను. చెట్లకింద గట్టు మీద కూర్చున్నాను. మనసంతా వికలమైపోయింది. శరీరం నీరసించింది. అవమాన భారం దహించేస్తోంది. నమ్మకద్రోహం వెక్కిరిస్తోంది. ఇంత నయవంచనా? ఇన్ని ఎత్తులా? ఇన్ని వ్యూహాలా. పెద్దవాళ్ళని రిస్క్ లో పెట్టి ఈ పెళ్లి తెలివిగా జరిపించుకున్నాడు. ఎవరికీ వీసమెత్తు అనుమానం కూడా రాలేదు. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఇందులో పాత్రధారులయ్యారా?. పెళ్లిలో అతని స్నేహితులు మాత్రమే ఉండేలా వ్యూహం రచించిన కుమార్ మనసులో ఇంత కుట్ర దాచుకుని నవ్వుతూ నటించాడా? మై గాడ్! ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్ధంకాని పరిస్థితి. కుమార్ తన ప్రాణం కోసం నన్ను పావుగా వాడుకుంటున్నాడు. దీన్ని ప్రేమంటారా? శోభనం పెళ్లి కూతురు ముస్తాబులో నిర్మానుష్య ప్రదేశంలో వుండకూడని చోట, వుండకూడని పరిస్థితుల్లో అగమ్యగోచరంగా నేను. వంచించే మనుషులు చాలా జాగ్రత్తగా వుంటారన్నమాట. ఇతరులకి ఏమాత్రం అనుమానం రాకుండా. కీచురాళ్ల అరుపులు, పక్షుల రెక్కల చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. నా గుండె చప్పుడు నాకే వినబడుతోంది. విధి ఇంతలా నా జీవితంతో ఆడుకుంటుందని అనుకోలేదు. ఇది కుమార్ బుర్రలో పుట్టిన ఆలోచనా, లేక జాతకాల మధు వ్యూహ రచనా ఎంత ఆలోచించినా అర్ధంకాలేదు. ఎందుకంటే అప్పుడు కుమార్ ప్రేమతప్ప నాకు ఏవీ కంటికి కనిపించలేదు. అది మంచికో చెడుకోగానీ నా ఆశ, ధ్యాస కుమార్ అయ్యాడు. ఎవరో తాగుబోతులు వస్తున్నారు. నేను చెట్టు చాటుకి వెళ్లి దాక్కున్నాను. వెళ్ళేవాళ్ళు చెట్టుదగ్గర ఆగిపోయారు. నేను కనపడకపోయినా నానుంచి వచ్చే మల్లెపూలు, సెంటు వాసనకి ఆగి చుట్టూ చూసారు. నేను ఇంకా వెనక్కి వెళ్లి మరో పొదవెనక చేరాను. వాళ్ళు అదంతా తిరిగి చూశారు. కాసేపు చూసి ఎవరూ కనబడకపోవడంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ve_LWZON2a8
Embed this episode
Ready to play
వినిపించని రాగాలు 8 | Vinipinchani ragalu 8 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.