EPISODE · Feb 26, 2023 · 16 MIN
వినిపించని రాగాలు 9 | Vinipinchani ragalu 9 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి వినిపించని రాగాలు 9 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కుమార్ స్పృహతప్పి పడిపోయాడు. అందరం అవాక్కై చూస్తున్నాము. అతని స్నేహితుడు అక్కడ్నించి పారిపోయాడు. తెల్లవారిపోయింది. వాకింగ్ వ్యక్తి, నేనూ కలిసి కుమార్ ని ఆటోలో ఇంటికి తీసుకెళ్లాం. ఇంటిముందు ఆటో ఆగేసరికి అమ్మా నాన్నా బయట కొచ్చారు. నేను దిగాను. "ఏమ్మా, పొద్దున్నే ఆటోలో వచ్చాశారా? " అంటూ నాన్న ఆటో దగ్గరకి వచ్చారు. "ఇంకా అందులోనే కూర్చున్నారే. దిగండి అల్లుడుగారూ. " అని నాన్న ఆటోలోకి చూసారు. షాక్ అయ్యారు. రక్తం ఓడుతూ చలనరహితంగా కుమార్.. కుమార్ అమ్మా నాన్నా కూడా బయటకు వచ్చి చూసి "మా కుమార్ కి ఏవైంది?" అంటూ పెద్దగా ఏడుపు మొదలు పెట్టారు. "ఉష్, గట్టిగా అరవకండి. ఇరుగుపొరుగు పోగవుతారు. అప్పుడు మీ పరువే పోతుంది" అన్నాడు నాతోపాటు వచ్చిన వ్యక్తి. అందరం కలిసి తోడుపట్టి కుమార్ ని వాళ్ళింట్లోకి తీసికెళ్లి పడుకోబెట్టాం. కుమార్ ని ఆ స్థితిలో చూసి కన్నీరు మున్నీరయ్యారు వాళ్ళ పేరెంట్స్. రెక్క తెగిన సీతాకోకలా ఉన్న నన్ను చూసి అమ్మా నాన్నా బావురుమన్నారు. జుట్టు రేగిపోయి, పూలదండ వాడి దారం వెళ్లాడుతూ, మురికి పట్టిన బట్టలు చూసి ఏదో పెద్ద ఘోరం జరిగివుంటుందని ఊహించారు. అమ్మ కాఫీ కలుపుకొచ్చి ఇచ్చింది. "కాసిని మంచినీళ్లు ఇవ్వమ్మా" అన్నాను. అమ్మ తెచ్చి ఇచ్చింది. నాతో వచ్చిన వ్యక్తి పార్క్ లో జరిగినదంతా వాళ్ళతో చెప్పాడు. విని నిర్ఘాంతపోయారు వాళ్ళు. "భగవంతుడా, కుమార్ కి ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టించావు. ఆడపిల్ల విషయంలో చేయకూడని పని ఎందుకు చేశాడు" అని వాళ్ళమ్మ ఏడ్చింది. నాన్న డాక్టర్ కి ఫోన్ చేస్తే వచ్చాడు. ప్రధమ చికిత్స చేసి కుమార్ ని "ఇంకా కొన ఊపిరి ఉంది. వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేయండి. "అన్నాడు. నేను వెంటనే స్నానం చేసి బట్టలు మార్చుకుని బయలుదేరాను. నాన్న నన్ను రావద్దన్నారు. అమ్మ కూడా వెళ్ళద్దంది. అమ్మా నేనూ ఇంట్లోనే ఉన్నాం. వాళ్లంతా కుమార్ ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లారు. పార్క్ లో నన్ను రక్షించిన వ్యక్తితో అమ్మ "మీరు గనక లేకపోతే ఈరోజు నా కూతురు ఏమైపోయేదో. దేవుడల్లే వచ్చి రక్షించారు. మీరుణం తీర్చుకోలేం" అంది చేతులు జోడిస్తూ”. " నాదేముందమ్మా, అమ్మాయి జీవితం పెద్ద ప్రమాదంలో ఉంది. రక్షించాల్సిన భర్తే దారుణం చెయ్యబోయాడంటే అది మామూలు విషయం కాదు. దీని వెనక ఎవరో వున్నారు. అమ్మాయిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. " అని చెప్పి వెళ్లిపోయారు. అమ్మ భయపడిపోయింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/skOKB-hw5kg
Embed this episode
Ready to play
వినిపించని రాగాలు 9 | Vinipinchani ragalu 9 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.