విరిసిన సుమం | Virisina Sumam | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 21, 2023 · 9 MIN

విరిసిన సుమం | Virisina Sumam | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) విరిసిన సుమం రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "సుమా! సాయంత్రం సినిమా కెళదామా!” అడిగాడు రవి క్లాసు నుంచి బయటకు వస్తున్న సుమను. "ఓకె రవి" అంది సుమ. ఎక్కడ? ఎన్నింటికి కలవాలో ఇద్దరూ మాట్లాడుకుని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు. సాయంత్రం ఇద్దరూ అనుకున్న సమయానికి సినిమా ధియేటర్లో కలిసి సినిమా చూసి ఆతర్వాత హొటలుకు వెళ్లి సరదాగా కాసేపు గడిపి ఇంటికి వెళ్ళారు. రవి, సుమ ఇద్దరూ ఒకే కాలేజీలో ఇంజినీరింగ్ ఆఖరి సం.. చదువుతూ ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి చదువు పూర్తి అయి మంచి ఉద్యోగం వచ్చేదాకా తమ ప్రేమ విషయం ఇంట్లో పేరెంట్సుకు చెప్పకూడదని నిర్ణయించుకున్నారు. ఇలా తరచూ సినిమాలకు, హోటల్స్ కు వెళ్ళి సరదాగా గడపడం వాళ్లకు అలవాటు. సుమ తరచూ బయటకు వెళ్లి ఆలస్యంగా ఇంటికి రావడం తల్లి రాధ గమనించి కూతురిని నిలదీసింది. ఏదో ఒక అబధ్ధం అతికినట్టు చెపుతూ తల్లిని నమ్మించటంతో 'తన పెంపకాన్ని కూతురు వమ్ముచేయదులే ' అనుకుంది రాధ. తెలివిగలదీ, చురుకైనదీ అయిన సుమ అంటే తండ్రి శ్రీధర్ కు కూడా చాలా ఇష్టం. రోజులు గడుస్తున్నాయి. సుమ, రవిల చదువులు పూర్తయి మంచి కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. ఇద్దరి ఇళ్ళలోనూ పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఇద్దరూ వాళ్ళ వాళ్ళ పేరెంట్సుకు తమ ప్రేమ విషయం చెప్పి తమ నిర్ణయాన్ని తెలిపారు. ఇరు కుటుంబాల పెద్దలు ఏవేవో కారణాలతో పెళ్లికి అంగీకరించలేదు. ఒక రోజున రవి, సుమ రిజిస్టరు మారేజి చేసుకుని ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కొత్త కాపురం మొదలు పెట్టారు. రోజూ ఉద్యోగం, సరాగాల కాపురంతో రవి, సుమలు ఆనందంగా ఉన్నారు. వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఏడాది తిరిగేసరికి చక్కటి పాప పుట్టినది. ఆ పాపకు 'దీప' అని పేరు పెట్టుకుని ప్రేమగా పెంచుకుంటున్నారు. ఇద్దరినీ కంపెనీ వాళ్లు అమెరికా పంపారు. దీపని తీసుకుని ఇద్దరూ అమెరికా వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఇల్లు ఆదీ సమకూర్చుకున్నాక ఉద్యోగ కర్తవ్య నిర్వహణలో బిజీ అయ్యారు. కొన్నాళ్లకి సుమ పేరెంట్సుల పట్టుదల సడలి వాట్సప్, ఫేస్ టైమ్ లలో కూతురు, అల్లుడితో మాటలు, మనుమరాలితో ముద్దు ముచ్చట్లు మొదలయ్యాయి. వీళ్ళ అన్యోన్య దాంపత్యంను చూసి విధికి కన్నుకొట్టిందేమో అన్నట్లుగా కొన్నాళ్లుగా రవి ప్రవర్తనలో మార్పు వస్తోంది. ఇంటికి సరిగ్గా రాకపోవటం, త్రాగుడు మొ... వ్యసనాలు అలవడి సుమని నిర్లక్ష్యం చేయడం, పాపను కూడా దగ్గరకు తీయకపోవడం చూసి సుమ చాలా బాధ పడి రవిలో మార్పుకు కారణం ఏమిటి? అని అడిగింది. "ఏంలేదు, మామూలే!" అని బుకాయించినా అతని కళ్ళల్లో అబధ్ధాన్ని పసిగట్టింది సుమ. కానీ కారణం తెలీలేదు. 'ఏదో పని ఒత్తిడేమో కొన్నాళ్ళకు అవే సర్దుకుంటాయిలే' అని ఓర్పు పట్టింది కానీ ఈ విషయాలు పేరెంట్సుకు చెప్పదలుచుకోలేదు. చెప్పి వాళ్ళను బాధపెట్టడం ఇష్టం లేదు సుమకు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/WXkVPOfIxXo

Episode metadata supplied by the publisher feed · Published Feb 21, 2023

Embed this episode

NOW PLAYING

విరిసిన సుమం | Virisina Sumam | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

0:00 9:37

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 21, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!