వనజ వంట ప్రహసనం - రామారావు అసహనం | Vanaja Vanta Prahasanam Ramarao asahanam | Telugu Short Story | M. Bhanu | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 10, 2023 · 6 MIN

వనజ వంట ప్రహసనం - రామారావు అసహనం | Vanaja Vanta Prahasanam Ramarao asahanam | Telugu Short Story | M. Bhanu | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Vanaja Vanta Prahasanam Ramarao asahanam - New Telugu Story Written By M. Bhanu 'వనజ వంట ప్రహసనం - రామారావు అసహనం' తెలుగు కథ రచన: M. భాను కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ పలకరిస్తుంటే బిత్తర చూపులు చూస్తోంది వనజ. కళ్ళు నుండి నీళ్లు ధారాపాతం గా కారిపోతున్నాయి. డాక్టర్లకి కూడా అంతు పట్టడం లేదు వనజ బాధ ఏమిటో. అప్పటికి వారం నుండి ఇలా సాగుతోంది. ఒకరోజు వనజ హఠాత్తుగా మంచం మీద కూర్చుని భయం భయంగా బిత్తర చూపులు చూస్తోంది, రామారావు ఆఫీస్ నుండి వచ్చేటప్పటికి. “ఏమైంది వనజా..” అని దగ్గరికి వెళ్ళబోతే ఇంకా ముడుచుకుపోయింది. తలను మోకాళ్ళ మధ్య పెట్టుకుంది. ఏమైందో తెలియక రామారావు కాసేపు మౌనంగా వనజనే చూస్తూ కూర్చున్నాడు. రామారావును చూస్తుంటే ఇంకా బెదిరిపోయి ముడుచుకుపోతోంది. రామారావుకి ఏమీ అర్థం కావటం లేదు. రోజు చూసే నన్ను చూసి ఇలా అయిపోతుంది ఏమిటి అనుకున్నాడు. బయటికి వచ్చి తన అత్తగారికి ఫోన్ చేశాడు. వాళ్లు ఉండేది మూడవ వీధిలో. వనజ పరిస్థితి వివరించి చెప్పాడు. ఇప్పుడే 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. వనజ తల్లి సీతాయమ్మ పెద్ద కొడుకుని తీసుకుని రామారావు ఇంటికి వచ్చింది. రామారావు ని అడిగింది వనజ ఎక్కడ అని. బెడ్ రూమ్ వైపు చూపెట్టాడు రామారావు. “సరే మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్తా”నని లోపలికి వెళ్ళింది సీతాయమ్మ. “రండి బావ.. ఇలా కూర్చోండి” అని రామారావు చేయి పట్టి సోఫాలో కూర్చోబెట్టాడు సుందరం. “ఏమిటో బావా, ఎప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి కాఫీ చేతిలో పెట్టేది. ఏమైనా తినడానికి ఇచ్చేది. లొడ లొడ మాట్లాడేది. ఇప్పుడు ఇలా! ? ఏమిటో నాకు అర్థం కావట్లేదు” అని కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. సుందరం, “ఊరుకో బావ! ఏమిటి కన్నీళ్లు, డాక్టర్ చూస్తున్నారుగా, ఏమీకాదు, ఏదో చూసి జడుసుకుని ఉంటుంది” అన్నాడు. “ఏమో బావ! నన్ను చూస్తోనే ముడుచుకుపోతోంది.” “బావ! ఏమీ అనుకోకు, ఒక విషయం అడుగుతాను, నిజాయితీ గా చెప్పు” అన్నాడు సుందరం. “నీకు తెలియని విషయం ఏమీ లేదు, సరే అడుగు” అన్నాడు రామారావు. “మీ మధ్య గొడవ ఏమైనా జరిగిందా? మా చెల్లిని కొట్టేవా? లేక ఏమైనా బెదిరించావా?” అన్నాడు సుందరం “చ్ఛా! నేను కొట్టడం ఏమిటీ? ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకునెంత మూర్ఖుడిని కాదు. అయినా నా గురించి తెలిసీ ఇలా ఎలా బావా! ?” బేలగా అన్నాడు రామారావు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/6vDFn0mGIDE

Episode metadata supplied by the publisher feed · Published Aug 10, 2023

Embed this episode

NOW PLAYING

వనజ వంట ప్రహసనం - రామారావు అసహనం | Vanaja Vanta Prahasanam Ramarao asahanam | Telugu Short Story | M. Bhanu | manatelugukathalu.com

0:00 6:51

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 6 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 10, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!