EPISODE · Feb 6, 2023 · 10 MIN
Vrasukunnamu Premalekhalenno | వ్రాసుకున్నాము ప్రేమలేఖలెన్నో | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వ్రాసుకున్నాము ప్రేమలేఖలెన్నో రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఇద్దరి మనసులు కలవడమే కాదు. ఇద్దరి ఆశయాలు కలిశాయి. ప్రేమించడమే కాదు.. ఆ ప్రేమకు అర్థం ఉండాలనుకున్నారు. —-ఈ ప్రేమ పక్షుల ప్రయాణం లోని, మధుర జ్ఞాపకాలను, ఉత్తరాల రూపంలో మారిస్తే వచ్చిందే ఈ “ వ్రాసుకున్నాము ప్రేమలేఖలెన్నో”. 28 నవంబర్ 1990–మహిళల వసతి గృహం, రెడ్డీ కాలేజీ. ప్రాయం పూచిన పులకరింతలను పుష్పగుచ్ఛంగా పంపి పరిమళం పంచుదామని..అంతరంగ ఆలోచనలను అక్షరాలతో అద్ది అందిద్దామన్న ఆదుర్దా. నా ప్రణయ లేఖ క్రమం కొరవడిన విలోమ కావ్యంలా ముగిసింది కదూ! ఏం చేయనూ? అరడజను సార్లు మొదలు పెట్టాను. ప్రారంభం కుదరలేదని వ్రాసింది మొత్తం కొట్టేశా. ముక్తాయింపు ముచ్చటగా లేదని తిరగరాశా. నా కుటుంబ నేపథ్యం అడిగావు కదా. నాకు నాలుగేళ్ళున్నప్పుడే ఏదో మిష మీద నాన్న ఇల్లు వదిలి పోయాడు. కొంత కాలానికి అమ్మ రక్తహీనతతో చనిపోయింది. కొంతకాలం మేనత్తలు పెంచారు. నరసాపూర్ దగ్గర పల్లెలో పెరిగాను. తొమ్మిదో తరగతిలో డబ్బులు పోగేసి రెండు ఆవులను కొన్నాను. పాలు అమ్మి మరిన్ని ఆవులు కొంటూ వచ్చాను. అలా అలా ముప్పై ఆవులయ్యాయి. అలా పాలసొమ్ముతో నా చదువు పూర్తయ్యింది. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ చేయడానికి రావడం, తమరి చూపులు నాపై పడటం, మీ మాయలో పడిపోవడం ఇట్టే జరిగిపోయింది. నీ శాన్వి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/WNJ3IwedHF8
Embed this episode
Ready to play
Vrasukunnamu Premalekhalenno | వ్రాసుకున్నాము ప్రేమలేఖలెన్నో | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.