వరద | Varada | Telugu short Story | Hanumantha T | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 3, 2023 · 4 MIN

వరద | Varada | Telugu short Story | Hanumantha T | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వరద రచన: T హనుమంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఈ ఏడు పంటలు బాగా పండాయి. దొరగారి బాకీ మొత్తం కట్టేసి పిల్లలను బాగా సదవించాలి మామా! ఇన్నిరోజులు పడ్డ కష్టాలు ఈ పంటతో తీరిపోతాయి” అన్నాడు అల్లుడు. “అవును అల్లుడూ.. నేను కూడా చేసిన అప్పంత తీరుస్తాను” అన్నాడు మామ. “ఈ సారి మాగాణి అంతా పంటలతో నిండి పోయిండాది. బొమ్మయ్య మామ కూడా కూతురి పెండ్లికి, ఆయన పెండ్లానికి ఆసుపత్రికి శాన అప్పులు చేసినాడు. ఈ పంటతో మొత్తం అప్పులు తీరుతాయి కదా మామ” అన్నాడు అల్లుడు. “అన్నట్టూ ఈ రోజు రచ్చబండ తాన జనాలంతా కలిసినారంట పోదామా అల్లుడూ..” “అవునా ఎందుకు మామా?” “వచ్చే మూడు రోజుల నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రైతులంతా గమనించి చేతికొచ్చిన పంటను కోయాలని ప్రభుత్వం వారి హెచ్చరిక - అని సర్పంచ్ గారు తెలియజేశారు. అది ఇన్న జనాలంతా మన వంక కు ఆనకట్ట కట్టాలని సెప్పినా ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు. ఈ వర్షానికి గనక మన వంక పొంగిందంటే మొత్తం మాగాణి కొట్టుకొని పోతుంది. అదే గనక జరిగితే ఇన్ని రోజుల కష్ట మంతా, ఆశలన్నీ వల్లకాడైపోతాయి. అకాల వర్షానికి ఎవరు బాధ్యులు కాలేరు. కానీ వర్షానికి ఇంకా మూడు రోజుల గడువుంది. కోతలు కోయడానికి సిద్దమవ్వండి. పంట నష్టపరిహారాన్ని తెలుపుతూ పై అధికారికి అర్జీ పెడతాను’ అన్నారు సర్పంచ్ గారు.” ’ అని చెప్పాడు మామ. జనాలంతా ఆత్రంగా పంట కోయడం మొదలుపెట్టారు. పసిపిల్లల నుండి పండు ముసలి వరకు అంతా పనిచేయ బట్టినారు. తుపాను గాలులు వీయడం మొదలుపెట్టాయి పంట కోత నుండి నూర్చడం వరకు వచ్చింది. నూర్చడానికి యంత్రాలు లేకపోవడం వల్లా తొందరగా అవడంలేదు. సెప్పిన సమయానికన్నా ముందే సినుకులు పడటం వల్ల ఎక్కడి గడ్డి అక్కడే, గింజలు అట్లాగే ఉండిపోయాయి. పొద్దు మునుగుతావుంది, సంచులల్లో వడ్లను నింపి గట్లకు తోలడం ప్రారంభించారు, కాని సినుకులు గట్టిగా పడటం వల్ల ఎద్దులు లాగలేక పోతున్నాయి. ఉరుములు, మెరుపులతో తుపాను ముంచుకొస్తోంది, అయినా అలాగే కష్టపడుతున్నారు, వంక పొంగుతోంది. ఆనకట్ట లేకపోవడం వల్లా నీరు సరాసరి పంటలోకి సేరుతోంది. నింపిన సంచులన్ని, గడ్డి కూడా వంక ఉదృతికి కొట్టుకొని పోతున్నాయి. సికట్లో వాళ్ళు సేసేది ఏమీలేక చూస్తూ ఉండి పోయినారు. బొమ్మయ్య మామ అప్పులు తీరవు అనే భయంతో గుండె పోటు తో మరణించే.. జనాలంతా ఏడుస్తూ వంక ఉదృతిలో కొట్టుకొని పోయే ఎద్దులను, సంచులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రేయల్లా అలాగే వర్షం పడుతూ వుంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/rN4qC48PW6g

Episode metadata supplied by the publisher feed · Published Jan 3, 2023

Embed this episode

NOW PLAYING

వరద | Varada | Telugu short Story | Hanumantha T | manatelugukathalu.com

0:00 4:11

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 4 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 3, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!