EPISODE · Aug 17, 2023 · 9 MIN
వృద్ధుడి చరమాంకం | Vruddhudi Charamankam | Telugu Short Story | Varanasi Bhanumurthy Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Vruddhudi Charamankam' - New Telugu Story Written By Varanasi Bhanumurthy Rao 'వృద్ధుడి చరమాంకం' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: వారణాసి భానుమూర్తి రావు కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ అర్ద రాత్రి అయినా ఇంకా నిద్ర రాలేదు పరంధామయ్యకు. నిద్ర వచ్చిందంటే వింత గానీ, నిద్ర పట్టక పోవడం అనేది మామూలు విషయమే ఈ వయసులో! హాల్లో జీరో లైట్ బల్బు వెలుగుతుంది గుడ్డి గుడ్డిగా తన జీవితంలాగే! ఫాన్ గాలికి కిర్రు కిర్రు మని శభ్ధం చేస్తున్నాయి కొక్కీలు లేని కిటికీ తలుపులు. ఒక్కొక్క సారి గాలికి శబ్ధం చేసుకొంటూ ముందుకూ వెనక్కు కొట్టుకొంటున్నాయి. కిటికీ చెక్క తలుపుల్లాగా తన గుండె ఎన్నో సార్లు బలంగా వేగంగా కొట్టుకొంటూ వూగిసలాడుతోంది. తను లేచి కిటికీ తలుపులు వేద్దామనుకొంటాడు. కానీ ఓపిక ఏదీ? దుమ్ము పట్టి, యాభై ఏళ్ళ నుండి తనతో సహ వాసం చేస్తూ కిర్రు కిర్రుమని శబ్ధం చేస్తూ తిరుగుతున్న ఫాను రెక్కల శబ్ధం తన రెక్కలుడిగిన వృద్ధ్యాపాన్ని పదే పదే గుర్తుకు తెస్తుంది. బేరింగులు చెడిపోయిన ఫాను చేసే వింత శబ్ధం వింటూ నిద్ర పోవడం తనకు అలవాటే! తను సావిత్రిని పెళ్ళి చేసుకొన్న రోజుల్లో తెచ్చుకొన్న ఓరియంట్ ఫాన్ అది. యాభై ఏళ్ళు అయినా ఇంకా మూలుగుతూ పని చేస్తోంది. ఈ ఇల్లు తను కష్ట పడి వూరవతల కట్టించుకొన్నాడు. ఆ రోజుల్లో లక్ష రూపాయల వ్యయంతో ఈ రెండు రూముల ఇల్లు కట్టించి యాభై ఏళ్ళు దాటింది. తనకు ముసలి వయసు వచ్చినట్లుగా ఈ ఇంటికీ ఆలనా పాలనా లేక పాత బడి పోయింది. ఇంటికి సున్నాలు కొట్టించింది పాతిక సంవత్సరాల క్రితం పెద్దోడి పెళ్ళి కోసం. పెద్దోడి పెళ్ళికి పైన ఒక రూము వేయించాడు తను. పిల్లలు వస్తే హాయిగా వుంటారని. పెద్దోడు పెళ్ళి చేసుకొని అమెరికా వెళ్ళి పోయి పాతిక సంవత్సరాలు దాటింది. ఇంతవరకూ వాడి మొహం తను చూడనే లేదు. ఎక్కడున్నాడో ఏమో పెద్దోడు, కనీసం ఫోన్ గూడా చెయ్యడు. ఎక్కడున్నాడో గూడా తెలీదు. చిన్నోడయినా ఇంటి పట్టున వుండి హైదరాబాదు లో వుద్యోగం చేసుకొని వుంటాడనుకొంటే ఏదో రష్యన్ అమ్మాయిని పెళ్ళి చేసుకొని రష్యాకి వెళ్ళి పొయ్యాడు. ఇంతవరకూ రాలేదు. ఎలా వున్నావన్న అడిగిన పాపాన పోలేదు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/o23YeMwSK68
Embed this episode
NOW PLAYING
వృద్ధుడి చరమాంకం | Vruddhudi Charamankam | Telugu Short Story | Varanasi Bhanumurthy Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.