EPISODE · Dec 24, 2022 · 13 MIN
యంత్రం | Yanthram | Telugu short Story | Susmitha Ramana Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) యంత్రం రచన : సుస్మితా రమణ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా!?…కుళాయి విప్పి అలా వదిలేయొద్దని?" అంది కూతురు. "బుజ్జి తువ్వాలని కేకేస్తే అలా వెళ్ళాను. ఈలోగా బకెట్ నిండినట్లుంది." చెప్పింది తల్లి. "స్నానానికి వెళ్ళేటప్పుడు, తువ్వాలు పెట్టుకోడం దానికి తెలీదా?...నీ గారాబం వల్లే అదలా తయారయింది." కూతురి కోపం. "చిన్నపిల్ల కదా!...నెమ్మదిగా అలవాటు అవుతుందిలే!" సర్ది చెప్పింది తల్లి. "ప్రతి దానికీ దాన్నలా వెనకేసుకు రావద్దు." అంది కూతురు. "అలాగే తల్లీ!" "ఏదో మాడు వాసన వస్తోంది చూడమ్మా!" కూతురి ఆర్డర్.. "అయ్యో!...స్టవ్ మీద పాలు పెట్టాను. నీ మాటల్లో పడి …” "ఈమధ్య అన్నీ ఇలాగే చేస్తున్నావు. పాలు నాతో మాట్లాడటం వల్లే మాడిపోయాయంటావ్!?..." తల్లిని విమర్శించింది కూతురు. "అలా నేనలేదే! ఈ మాత్రం దానికే ఇంతలా కేకలు వేయాలా!?..." బాధ పడింది తల్లి. "నా నోరే వినిపిస్తోంది. నీవు చేస్తోంది ఎవరికీ కనిపించటంలేదు. ఆయనకు ఆఫీసు టైం అవుతోంది కేరేజ్ కట్టేసావా?" "అయిపోవస్తోంది… అయిదు నిముషాల్లో!" "తొందరగా కానీ ! తెల్లారే లేస్తావు. ఏం ప్రయోజనం?...ఆ గిన్నెలు పనిమనిషి తోమి కడుగుతుందిగా ?...ఆ పనులు నీవెందుకు చేయడం?..శుద్ధ దండగ!” "రాత్రి తిన్న కంచాలలో వదిలేసిన వాటిని మనమే తీసి, చెత్త కవరులో పడేయాలి. కంచాలలో కాసిన్ని నీళ్ళు పోస్తే,అవి ఎండిపోవు.” "పనిమనిషి ఆపని చేస్తుందిలే!” "బుజ్జి దాని కేరేజ్, అల్లుడు గారి కేరేజ్ తోమి కడిగాను. పనిమనిషి వచ్చేలోగా అవసరమైనవి మనమే శుభ్రం చేసుకోవాలి కదా ?" చెప్పింది తల్లి. "అన్ని పనులు ఒకేసారి చేసేద్దామనుకుంటావ్ ! ఏ పనీ సవ్యంగా చేయవు.” "దానికి టిఫిన్ పెట్టి, కేరేజ్ కడుతున్నాను. అలా నాలుగు మాటలు అనేకంటే ఆయన కేరేజ్ నీవు కట్టేయొచ్చుగా? …” "స్సరే! రేపటి నుంచి అన్ని పనులు నేనే చేసుకుంటాలే!" "అంత నిష్ఠూరం దేనికమ్మా? ఉదయం పూట వంట పనిలో కాస్త సాయం చేస్తే నాకింత హైరాన ఉండదు కదా?" అంది తల్లి. "ఇకమీదట నీకెలాంటి ఇబ్బంది ఉండదులే! వంట మనిషిని మాట్లాడుతా. అన్నీ తనే చేస్తుంది." Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/mF7S0Oa-XU0
Embed this episode
NOW PLAYING
యంత్రం | Yanthram | Telugu short Story | Susmitha Ramana Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.