EPISODE · Nov 7, 2022 · 7 MIN
యశోదమ్మ గారి బొమ్మల కొలువు | Yasodamma Gari Bommala Koluvu | Telugu Shot Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) యశోదమ్మ గారి బొమ్మల కొలువు రచన : M R V సత్యనారాయణ మూర్తి దసరా నవరాత్రులు వచ్చాయంటే మా పెనుగొండ వీధులన్నీ భక్తులతో కళ కళ లాడిపోతాయి. నగరేశ్వర స్వామి గుడిలో ఉన్న మహిషాసుర మర్ధినీ అమ్మవారికి, కన్యకాపరమేశ్వరి అమ్మవారికి చాలా ఘనంగా పూజలు చేస్తారు. కంచి కామాక్షి అమ్మవారి గుడిలోని అమ్మవారికి కూడా నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. కామాక్షి గుడి దగ్గర రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి తొమ్మిది రోజులూ. హరికథలూ, బుర్రకథలూ, డ్రామాలు, రికార్డింగ్ డాన్సులు... అబ్బో చాలా ఉంటాయి కామాక్షి గుడిదగ్గర. రాత్రి ఎనిమిది దాటాకా పిల్లలు, కుర్రకారూ ఇక్కడే ఉంటారు మరి. లింగాలవీధి మొగలో ఉంది సుబ్బన్న పంతులుగారి ఇల్లు. ఐదు వందల గజాల స్థలంలో కట్టిన పెద్ద డాబా. ఇంటి చుట్టూ జామ, పనస, సపోటా, మామిడి చెట్లు ఏపుగా పెరిగి ఉంటాయి. వాటితో పాటే పూల మొక్కలూనూ. ఒక మూలగా ఉన్న పాకలో ఒక ఆవు, గేదె ఉంటాయి. పంతులు గారు చుండూరి సూర్యనారాయణ గారి ఎలిమెంటరీ స్కూల్ లో హెడ్ మాస్టర్. ఊళ్ళో జామీన్దారులు అందరూ ఆయన స్నేహితులే. వాళ్ళ ఇల్లు ఎప్పుడూ ఆయన స్నేహితులతో సందడిగా ఉంటుంది. వాళ్ళ ఇంటికి రెండిళ్ళ అవతల స్వాతంత్ర సమరయోధులు దగ్గుబాటి సీతారామయ్య గారి పెద్ద పెంకుటిల్లు ఉంది. పంతులుగారి భార్య యశోదమ్మ. వాళ్లకి ఏడుగురు సంతానం. అత్తగారు మంగమ్మ, కోడలికి ఏడు పురుళ్ళు తానే పోసింది. కారణం యశోదమ్మ పెళ్లి అయిన రెండేళ్లకే వాళ్ళ అమ్మ చనిపోయింది. తండ్రి సీతారామ సోమయాజులు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఆడ దిక్కు లేని సంసారం అవడం వలన మంగమ్మ తానే యశోదమ్మ కి తల్లిగా మారి, అన్ని పురుళ్ళు పోసింది. యశోదమ్మ గారు ఏటా నవరాత్రులకి బొమ్మలకొలువు పెడతారు. ఆ బొమ్మల కొలువు లోని బొమ్మలు చాలా అందంగా ఉంటాయి. తనకు తెలుసున్న వాళ్ళు అందరినీ ఆవిడ పేరంటానికి పిలుస్తారు. ఈ బొమ్మలకొలువు విశేషం ఏమిటంటే ప్రతిరోజూ కొన్ని కొత్త బొమ్మల్ని తయారుచేసి బొమ్మలకొలువు లో పెడతారు యశోదమ్మ గారు. అవి చూడటానికి పెద్దలతో పాటు పిల్లలు కూడా వస్తారు వాళ్ళ ఇంటికి. పొద్దున్నే యశోదమ్మ వాళ్ళ అత్త మంగమ్మ కొత్త బొమ్మల్ని దొడ్లో తయారు చేస్తారు. వాటికి రంగులు వేయడం యశోదమ్మ గారి పిల్లల డ్యూటీ. ఒక రోజు దశావతారాలు, మరో రోజు నవదుర్గలు, ఇంకోరోజు అష్టదిక్పాలకులు ఇలా రక రకాల బొమ్మలు చేసి కొలువులో పెడతారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/5jprIMU8t-U
Embed this episode
Ready to play
యశోదమ్మ గారి బొమ్మల కొలువు | Yasodamma Gari Bommala Koluvu | Telugu Shot Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.