EPISODE · Oct 18, 2020 · 7 MIN
"ఆ చేతులెవరివో"- కథ రచయిత: శ్రీ రమణ గారు
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
శ్రీ రమణ గారి పదచిత్రం. "ఆ చేతులు ఎవరివో ! సాహిత్యాభిమానులకు నమస్కారం. సాహిత్యం హృదయ సంస్కారాన్ని పెంపొందించాలి అని నా అభిప్రాయం. కథ , కవిత , వ్యాసం , నవల , నాటకం ఏదైనా చదివినప్పుడు , విన్నప్పుడు లేదా చూసినప్పుడు ఒక హృదయ స్పందన కలిగించాలి. అప్పుడే సాహిత్యం యొక్క ప్రయోజనం నెరవేరినట్టు. రచయిత ఒక మంచి విషయాన్ని చెప్పదల్చుకున్నప్పుడు ఆ విషయ పరిథి , విస్తృతిని బట్టి , తన మనసులోని భావము , ఆలోచనను బట్టి , రచనకు రూపం కల్పిస్తాడు. శ్రీ రమణ గారు కథా రచయితగా సుప్రసిద్ధులు అయినప్పటికీ , పత్రికా రచయితగా ఆయన అయిదు దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి దిన , వార పత్రికలలో "రంగుల రాట్నం" , ఫీచర్ రచయితగా , ఆంధ్రప్రభ వార పత్రికలో .."శ్రీఛానల్ " నవ్య వార పత్రికకు ఎడిటర్ గా "మొదటి పేజీ", ప్రస్తుతం ప్రతి శనివారం సాక్షి దిన పత్రికలో "అక్షర తూణీరం" పేరుతో....వందలకొద్దీ విషయాల మీద తనదైన శైలిలో వ్యాఖ్యలు, వ్యాసాలు వెలువరిస్తున్నారు. ఆయన రచనల్లో చాలా వాటిలో మానవత్వ భావన అంతర్లీనంగా బలంగా ఉంటుంది. బంగారు మురుగు కథలో ఆయన సృష్టించిన బామ్మ పాత్ర జీవితం పట్ల ఆయనకు గల విశాల దృక్పథాన్ని మూర్తీభవించిన పాత్రగా చెప్పచ్చు. ఈ పదచిత్రం "ఆ చేతులు ఎవరివో " లో ఒక పేదరాలు , బిడ్డల ఆకలి తీర్చడానికి ఒక వేద విదుడైన అగ్రహారీకుని చేలో పండిన వరి మోపు దొంగిలించడానికి సిద్ధ పడితే ఆ మహానుభావుడు ఆమెకు అదృశ్య హస్తం అందించి సాయపడతాడు. ఆయన పంట చేలోనే తాను వరి మోపు తీసుకున్నట్టు ఆ మోపుతో చిక్కుకుని వచ్చిన ఆయన యజ్ఞోపవీతం ఆమెకు తెలియచెప్తుంది. ఆయన హృదయ ఔన్నత్యానికి నివాళులు అర్పిస్తూ , చేసిన తప్పు ఒప్పు కుని ఆ పేద మహిళ పులు కడిగిన ముత్యంగా నిలుస్తుంది , ఆయన దృష్టిలో , భగవంతుని ముందు. వినండి, శ్రీరమణ గారి పద చిత్రం "ఆ చేతులు ఎవరివో !" 💐💐🙏 మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada.
Embed this episode
NOW PLAYING
"ఆ చేతులెవరివో"- కథ రచయిత: శ్రీ రమణ గారు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.