Skip to content
"కొప్పర్తి కథావాహిని " podcast artwork

PODCAST · arts

"కొప్పర్తి కథావాహిని "

by Rambabu Kopparthy

Stories Rendered By Rambabu Kopparthy

Publisher-supplied feed metadata · PodParley refreshed Sep 6, 2025 · Source feed

Episodes

  1. పడమటి సంధ్యారాగం. రచయిత: శ్రీ విన్నకోట రామచంద్ర కౌండిన్య గారు.

    పడమటి సంధ్యారాగం. రచయిత: శ్రీ విన్నకోట రామచంద్ర కౌండిన్య గారు.

  2. Ash Tray Telugu Story by Chaganti Tulasi garu | "యాష్ ట్రే" - చాగంటి తులసి గారు.

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి , కథాభిమానులకు నమస్కారం.🙏💐💐 ఈ వారం మనం వినబోయే కథ "యాష్ ట్రే " రచయిత్రి చాగంటి తులసి గారు. సాహితీ రంగంలో వారసత్వ సంపద అంది పుచ్చుకుని పుట్టిన కొంతమంది అదృష్టవంతుల్లో తులసి గారు ఒకరు. స్వర్గీయ చాగంటి సోమయాజులు (చా.సో ) గారి కుమార్తె. సాహిత్య వాతావరణంలో, వారి...

  3. నా ఇల్లు ఎక్కడ?- రచయిత: శ్రీ ముకుంద రామారావు గారు.

    💐💐సాహిత్యాభిమానులకు నమస్కారం 🙏"నా ఇల్లెక్కడ ?" కథ. రచయిత శ్రీ ముకుంద రామారావు గారు. కవి , కథకుడు , వ్యాసకర్త , అనువాదకుడు , మనసులోని భావుకత్వాన్ని మాటల్లోకి పొదగగల రచయిత శ్రీ ముకుంద రామారావుగారు.... 9 నవంబర్ 1944 న , ఖరగ్ పూర్ లో జన్మించారు. ప్రస్తుత నివాసం హైద్రాబాద్ . ఫోన్ నెంబర్ 99083…

    more
  4. కీ శే బాల సుబ్రహ్మణ్యం గారికి, శ్రీరమణ గారి అక్షర తూణీర నివాళి

    🙏 బాలూ గారిని నా కథానాయకుడు అని గర్వంగా చెప్పుకోగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది "మిథునం " కథా రచయిత శ్రీ రమణ గారే ! బాలూ ఆయన సృష్టించిన అప్పదాసుని "మిథునం" సినిమా ద్వారా మన కళ్ళముందు నిలిపారు. శ్రీరమణ గారికి బాపూ -బాలూ వీరిద్దరితో అనుబంధము -స్నేహము. గాన గంధర్వుడికి కి నివాళి అర్పిస్తూ...

  5. "ఆ చేతులెవరివో"- కథ రచయిత: శ్రీ రమణ గారు

    శ్రీ రమణ గారి పదచిత్రం. "ఆ చేతులు ఎవరివో ! సాహిత్యాభిమానులకు నమస్కారం. సాహిత్యం హృదయ సంస్కారాన్ని పెంపొందించాలి అని నా అభిప్రాయం. కథ , కవిత , వ్యాసం , నవల , నాటకం ఏదైనా చదివినప్పుడు , విన్నప్పుడు లేదా చూసినప్పుడు ఒక హృదయ స్పందన కలిగించాలి. అప్పుడే సాహిత్యం యొక్క ప్రయోజనం నెరవేరినట్టు. రచయిత ఒక…

    more
  6. వల్లూరు శివప్రసాద్ గారి కథ - " ఇస్ మిట్టిసే తిలక్ కరో " 🙇🏾‍♂️ 🇮🇳 💐

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం. 💐💐🙏 ఈ వారం మనం వినబోయే కథ "ఇస్ మిట్టిసే తిలక్ కరో !" రచయిత శ్రీ వల్లూరు శివప్రసాద్. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీ శివప్రసాద్ కేవలం కథా రచయిత మాత్రమే కాదు , నాటక రచయిత , పుస్తక ప్రచురణ కర్త , సాహిత్య…

    more
  7. ఆరుద్ర గారి కథ - "దీవెన"

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 💐💐🙏ఈ వారం మనం వినబోయే కథ "దీవెన "రచన కీ. శే. ఆరుద్ర గారు. సినీ గేయ కవిగా ప్రసిద్ధులైన ఆరుద్ర గారు , అభ్యుదయ కవి , సాహిత్యకారులు , విమర్శకులు , నాటక రచయిత అన్నిటినీ మించి సాహిత్య పరిశోధకులు. వీరి పరిశోధనా గ్రంథం "సమగ్ర ఆంధ్ర సాహిత్యం "...

  8. రైలు బండిలో వైతాళికులు - రచయిత: శ్రీ రమణ గారు.

    శ్రోతలకు నమస్కారం..... గిడుగు రామమూర్తి పంతులుగారి పుట్టినరోజు... తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా తెలుగు భాషకి సంబంధించి ఏదన్నా కొత్తదనం ఉండేలా చెయ్యాలి అని ఆలోచన కలిగినప్పుడు , చప్పున స్ఫూరించింది శ్రీ రమణ గారి " రైలు పెట్టెలో వైతాళికులు " హాస్య రూపకం దానికి శబ్ద రూపం ఇస్తే , ఆధునిక తెలుగు...

  9. జ్ఞానపీఠ బహుమతి గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ గారి రచన - " ఒక ఎలుక కథ ".

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏🏻💐💐 ఈ వారం మనం వినబోయే కథ "ఒక ఎలుక కథ " రచయిత శ్రీ రావూరి భరద్వాజ . రచయితగా ఏమాత్రం పరిచయం చెయ్యవలసిన అవసరం లేని మహా రచయిత శ్రీ రావూరి భరద్వాజ.సమాజాన్ని నిశితంగా పరిశీలించి మంచి చెడులను విస్పష్టంగా విడదీసి చూపి రచనలను చేసిన రచయిత భరద్వాజ…

    more
  10. "తిలదానం" - రచయిత కీ. శే. రెంటాల నాగేశ్వరరావు

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకి నమస్కారం.💐💐🙏 ఈ వారం మనం వినబోయే కథ "తిలదానం" రచయిత కీ. శే. రెంటాల నాగేశ్వరరావు నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో 2000 సంవత్సరంలో గంటా ముఫై నిముషాల చిత్రంగా రూపొందించబడిన సినిమాకు మూల కథ ఈ " తిలదానం." సినిమాకు సంభాషణలు కూడా మూల కథా రచయితే...

  11. అత్తగారూ ఆవకాయ- రచయిత్రి: శ్రీమతి భానుమతీ రామకృష్ణ

    💐💐కృష్ణాతీరం , విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.💐💐🙏 ఈవారం మనం వినబోయే కథ "అత్తగారు -ఆవకాయ " రచయిత్రి బహుముఖ ప్రజ్ఞాశీలి శ్రీమతి భానుమతీ రామకృష్ణ. భానుమతి గారి గురించి తెలియని తెలుగు వారు ఉండరు. బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న టైటిల్ కి సంపూర్ణంగా సరిపోయే స్త్రీ మూర్తి. నటిగా , గాయనిగా , దర్శక...

  12. ఎందుకుపారేస్తాను నాన్నా ! కథ, రచయిత చాగంటి సోమయాజులు

    ఎందుకుపారేస్తాను నాన్నా ! కథ, రచయిత చాగంటి సోమయాజులు

  13. కీ. శే.దేవరకొండ బాల గంగాధర తిలక్ గారి శతజయంతి సందర్భంగా వారి కవిత "గుండె కింద నవ్వు"...వారి కథ "నవ్వు"

    💐💐 *కవి-కథకుడు కీ. శే.దేవరకొండ బాల గంగాధర తిలక్ గారి శతజయంతి సందర్భంగా వారి కవిత "గుండె కింద నవ్వు"...వారి కథ "నవ్వు"* 💐💐 కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏 తిలక్ గారి "నవ్వు " కథ గురించి చెప్పాలి అంటే... తిలక్ గారి మాటల్లోనే చెప్పాలి ...ఒక వ్యక్తి జీవితాన్ని....జీవిత...

  14. "వెన్నెల నీడ " రచన శ్రీ భ.రా.గో.(భమిడిపాటి రామ గోపాలం )

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 🙏ఈ వారం మనం వినబోయే కథ *" వెన్నెల నీడ " రచన శ్రీ భ.రా.గో.(భమిడిపాటి రామ గోపాలం )* శ్రీ భరాగో హాస్య రచయిత గా గుర్తింపు పొందినా... మనసులోతుల్ని స్పృశించే కథలు ఎన్నో రాశారు. అటువంటి గొప్ప కథల్లో కథే "వెన్నెల నీడ". మానవ జీవితంలో అనేక సంబంధ…

    more
  15. "కాఫీ పెట్టవూ !" రచయిత్రి కిరణ్ విభావరి

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం. 🙏ఈ వారం మనం వినబోయే కథ "కాఫీ పెట్టవూ !" రచయిత్రి కిరణ్ విభావరి. నేను సాధారణంగా కథ చదివి వినిపించడానికి ఎంచుకునేటప్పుడు వర్ధమాన రచయిత లేదా ప్రఖ్యాత రచయిత కథ అయినా కథలో కదిలించే గుణం ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటాను. ఆవిధంగా "కాఫీ పెట్టవూ " కథ…

    more
  16. "బుద్బుదం" రావి శాస్త్రి గారి రచన

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకి నమస్కారం 🙏ఈ వారం మనం వినబోయే కథ "బుద్బుదం "....రచయిత రావి శాస్త్రిగా ప్రసిద్ధి చెందిన కీ. శే.రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన మహా రచయిత. మానవ జీవితంలోని కష్టాలను చాలా స్పష్టంగా చూపిస్తూ రచనలు చేసిన ప్రజల రచయిత...

  17. "మూలాధార చక్రం " రచయిత కీర్తి శేషులు.. శ్రీ వీరపల్లె వీణావాణి

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకి నమస్కారం.🙏. ఈ వారం మనం వినబోయే కథ "మూలాధార చక్రం " రచయిత కీర్తి శేషులు.. శ్రీ వీరపల్లె వీణావాణి .ఆయన ఇంటిపేరు వీరపల్లె ....వీణావాణి ఆయన కలం పేరు. అసలు పేరు ఆంజనేయులు నాయుడు. 1981 లో నేను చిత్తూరు జిల్లాలో శ్రీ వేంకటేశ్వర గ్రామీణబ్యాంక్ లో…

    more
  18. మా బావమరిది పెళ్లి ...రచయిత శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు.

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.💐💐🙏ఈ వారం మనం వినబోయే కథ... *మా బావమరిది పెళ్లి ...రచయిత శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు.* ఏ రచయిత అయినా తన రచనల ద్వారా శాశ్వతత్వం పొందుతారు అనేది నిర్వివాదాంశం. అయితే కొందరు రచయితలు వారి రచనల్లో పాత్రలకు సజీవ రూపం కల్పించి ఆ పాత్రలకు కూడా...

  19. "పరిశుద్ధ వివాహము - మూడవ ప్రకటన "రచయిత శ్రీ P.V. సునీల్ కుమార్ IPS

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం. 🙏 *ఈ వారం మనం వినబోయే కథ "పరిశుద్ధ వివాహము - మూడవ ప్రకటన "రచయిత శ్రీ P.V. సునీల్ కుమార్ IPS, Addl. DGP Chief of CID* సునీల్ కుమార్ గారి ఈ కథ వారి కథాసంకలనం " నీలవేణి " నుండి తీసుకున్నాను. ఆ కథాసంపుటిలో మొత్తం 15 కథలు ఉన్నాయి.కథాంశం పరంగా వేటికి...

  20. కీ. శే. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి "డు.. ము..వు..లు

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 🙏💐💐ఈ వారం మనం వినబోయే కథ కీ. శే. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి "డు.. ము..వు..లు ".ఈ నాలుగు అక్షరాలు విడి విడిగా చదవగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది....తెలుగు వ్యాకరణం లోని... విభక్తి ప్రత్యయాలు...వాటిలోని ప్రథమావిభక్తి . చిన్నప్పుడు అర్థం అయినా...

  21. "చిట్ట చివరి సున్నా " రచయిత శ్రీ భగవంతం

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 🙏. ఈ వారం మనం వినబోయే కథ "చిట్ట చివరి సున్నా " రచయిత శ్రీ భగవంతం. రచయిత శ్రీ భగవంతం అసలుపేరు నరసింహారావు. భగవంతం కలం పేరు. ప్రత్యేకించి ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే...ఈ రచయిత తన కలంపేరుని వేరొక ప్రసిద్ధ రచయిత రాసిన కథలోని పేరుని తన కలం…

    more
  22. "ఓ పువ్వు పూసింది " రచయిత చలం గారు

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 🙏ఈ వారం మనం వినబోయే కథ "ఓ పువ్వు పూసింది " రచయిత చలం గారు. తెలుగు సాహిత్యంలో ఒక ఉప్పెన. భావాలకు మాత్రమే కాదు...భాష విషయంలో కూడా ! ప్రత్యేకించి భాష గురించి ఎందుకు చెప్తున్నాను అంటే..."ఓ పువ్వు పూసింది " కథ కాదు....కథలాంటి కవిత. భాషలోను భావంలోను...

  23. కవి అఫ్సర్ కథ "ముస్తఫామరణం "

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.💐💐🙏కాలాలు, ఋతువుల్ని బట్టి నిర్ణయం జరిగి , వాతావరణం లోని మార్పులకి అనుగుణంగా....వర్షాకాలం, శీతాకాలం , వేసవికాలం అని పిలుచుకుంటున్నట్టు....కొత్తగా కరోనా కాలం ...ఒక ఋతువు ఎంత కాలం ఉంటుందో అంతకాలమూ ఉండేలా ఉన్నది. గ్రీష్మతాపం ఎక్కువ అయ్యింది.…

    more
  24. వేటూరి వారి వర్థంతి

    💐💐ఈరోజు 22nd May 2020 వేటూరి వారి వర్థంతి.🙏 ఉదయం నించి ఏ వాట్సఆప్ గ్రూపు తెరిచినా వారి గురించిన విశేషాలు....జ్ఞాపకాలు....మాటలు....వారి పాటలు. వేటూరి వారిని ఎవరం అయినా సినిమా కవిగానే గుర్తుంచుకుంటాము.కాదనను. కానీ ఆయన సినీ గీతరచనకు గొప్పతనం చేకూర్చింది ....ఆయన పాండిత్యం. ఆయన పత్రికా రచనలో...

  25. "రావులయ్య " రచయిత కీ. శే. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏 *ఈ వారం మనం వినబోయే కథ "రావులయ్య " రచయిత కీ. శే. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు* శ్రీపాదవారు ఎన్నో ప్రసిద్ధమైన కథలు రాశారు. వాటిలో సుప్రసిద్ధమైన ఆరేడు కథల పేర్లు చెప్తాను.1.గులాబీ అత్తరు.2.తాపీ మేస్త్రి రామదీక్షితులు BA 3 కలుపు మొక్కలు 4...

  26. కళింగ ఆంధ్ర వారసుడు డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు కథ "దాలప్ప తీర్థం.

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏కరోనా లాక్డౌన్ రెండు వారాలు అనుకున్నది, రెండు నెలలకు చేరువ అవుతున్నది. ఒక మహమ్మారిపై ఓపికగా పోరాడుతున్న భారత ప్రజానీకాన్ని , కష్టకాలంలో వారికి అత్యవసర సేవలు అందిస్తున్నవారిని అభినందించాలి. మంచిరోజులు రానున్నాయి అని అందరం ఆశగా ఎదురుచూద్దాము. గత...

  27. గురజాడ వారి దిద్దుబాటు & శ్రీ శ్రీ గారి....అశ్వమేథయాగం

    💐💐 *కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం* అందరూ ఇళ్లకు పరిమితమై....కరోనా విషయంలో జాగ్రత్త వహిస్తూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. *ఈవారం ఇద్దరు మహాకవుల కథలు....వినిపిస్తున్నాను. ఒకరు గురజాడ....మరొకరు శ్రీ శ్రీ.....* ఇద్దరూ మహాకవులే ! శ్రీ శ్రీ గారు గురజాడకు వీరాభిమాని. "అడుగుజాడ...

  28. యూ టర్న్....రచయిత శ్రీ దగ్గుమాటి పద్మాకర్

    💐💐 *కృష్ణాతీరం విజయవాడ నుండి...కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ....యూ టర్న్....రచయిత శ్రీ దగ్గుమాటి పద్మాకర్* రచయిత అనే వ్యక్తి తనలోని సీరియస్ ఆలోచనల్ని తన రాతల్లోకి అనువదించగలిగితే.... ఆ రచన నిశ్చయంగా గొప్పగా ఉంటుంది. శ్రీ పద్మాకర్ అటువంటి సీరియస్ రచయిత.గొప్పరచయిత. రచనని ఒక సామాజిక...

  29. "వెండి కంచం " . రచయిత కీ. శే.మునిమాణిక్యం నరసింహారావు గారు

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏ఈ వారం మనం వినబోయే కథ "వెండి కంచం " . రచయిత కీ. శే.మునిమాణిక్యం నరసింహారావు గారు.పాతరోజుల కథ. కథాకాలం ఇదమిద్దం గా తెలియదు.స్వాతంత్రం వచ్చిన తొలిరోజులుకావచ్చు. మునిమాణిక్యం వారు అనగానే గుర్తొచ్చే పాత్ర "కాంతం" . మధ్యతరగతి ఇల్లాలికి సజీవ రూపం....

  30. "పూర్ణమూ....నిరంతరమూ..." రచయిత కె ఏ ముని సురేష్ పిళ్లే

    💐💐 కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏యధాప్రకారం మూడో వారం ఎవరి ఇళ్ళవద్ద వారు క్షేమంగా కాలం గడుపుతున్నట్లు తలుస్తాను. *ఈవారం మనం వినబోయే కథ "పూర్ణమూ....నిరంతరమూ..." రచయిత కె ఏ ముని సురేష్ పిళ్లే* శ్రీకాళహస్తికి చెందిన ముని సురేష్ గారు పాత్రికేయుడు , రచయిత. ఆయన రాసిన ఈ కథ...

  31. "నరసన్న పాపాయి " రచయిత ....కీ.శే.అడవి బాపిరాజు గారు

    💐💐 కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏ఈ వారం కూడా అందరూ స్వహితం , లోకహితం కోసం ఇళ్లకు పరిమితం అయి క్షేమంగా ఉంటున్నారు అని భావిస్తాను. ఈ వారం మనం వినబోయే కథ "నరసన్న పాపాయి " రచయిత ....కీ.శే.అడవి బాపిరాజు గారు. బాపిరాజు గారు కవి , రచయిత , చిత్రకారుడు.... కళాతపస్వి. ఈ కథ…

    more
  32. కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు ఆల్ ఇండియా రేడియోలో చేసిన వాక్ చిత్రం "జానకితో జనాంతికం "

    కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు ఆల్ ఇండియా రేడియోలో చేసిన వాక్ చిత్రం "జానకితో జనాంతికం " కి బాపుగారు వేసిన చిత్రం ఇది. సర్వం తానే అయి వుండి వ్యాపించి ఉన్న స్వామి పాదాల వద్ద అమ్మవారు కూచుని అంతటా ఉన్న ఆయన వద్ద జనాంతికం ఎలా అన్నట్టు చిన్న నవ్వు నవ్వుతున్న ఈ బొమ్మ బాపూ గారికి ఎంతో...

  33. "తరగతి గదిలో తల్లి " రచయిత శ్రీ సింగమనేని నారాయణ

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 🙏. అందరూ ఇళ్లకు పరిమితమయ్యి క్షేమంగా ఉన్నారని భావిస్తాను. ఈ వారం మనం వినబోయే కథ "తరగతి గదిలో తల్లి " రచయిత శ్రీ సింగమనేని నారాయణ. ఈ కథ నాకు జనవరి నెలలో జరిగిన విజయవాడ పుస్తక మహోత్సవంలో ఒక సాహిత్యాభిమాని చిన్న booklet గా వేసి పంచిపెడుతుండగా....నా...

  34. "పరిష్వంగం" . రచన శ్రీ పి. రామకృష్ణ.

    కృష్ణాతీరం విజయవాడ నుండి....కథాభిమానులకు నమస్కారం.🙏ఈ వారం మనం వినబోయే కథ "పరిష్వంగం" . రచన శ్రీ పి. రామకృష్ణ. ఈ కథలోనూ...ఈ కథ నేను మీకు చదివి వినిపించడంలోనూ ఒక మంచి విషయం ఉంది. నేను తెలుగు కథలు చదివి వినిపించడం మొదలుపెట్టినప్పటి నుంచి నా వద్దనున్న వివిధ కథానికా సంకలనాల్లోంచి ఎంచుకుని కథలు...

  35. "గోధూళి వేళ " , రచయిత్రి శ్రీమతి పి.సత్యవతి

    💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ సందర్భంగా , ఈ వారం మనం వినబోయే కథ "గోధూళి వేళ " , రచయిత్రి శ్రీమతి పి.సత్యవతి. సత్యవతి గారు ప్రముఖ రచయిత్రి. స్త్రీల సమస్యలను ఎంతో స్పష్టంగా అర్థం చేసుకుని , రచనలు చేస్తారు. ఆమె కథ చెప్పే తీరులో గొప్ప శిల్ప...

  36. చా. సో గా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి సోమయాజులు గారి రచన "ఎందుకు పారేస్తాను నాన్నా "

    💐💐 కృష్ణా తీరం విజయవాడ నుండి కథాభిమానులకి నమస్కారం.🙏 ఈవారం మనం వినబోయే కథ చా. సో గా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి సోమయాజులు గారి రచన "ఎందుకు పారేస్తాను నాన్నా ". ఉత్తరాంధ్ర రచయితల్లో అగ్రశ్రేణి రచయిత , అభ్యుదయ తెలుగుసాహిత్యానికి ప్రతినిధి అనదగ్గ కొద్దిమంది రచయితల్లో కీ.శే శ్రీ చా సో ఒకరు. గురజాడ,...

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

Stories Rendered By Rambabu Kopparthy

HOSTED BY

Rambabu Kopparthy

CATEGORIES

Frequently Asked Questions

How many episodes does "కొప్పర్తి కథావాహిని " have?

"కొప్పర్తి కథావాహిని " currently has 106 episodes available on PodParley. New episodes are automatically indexed when they're published to the podcast feed.

What is "కొప్పర్తి కథావాహిని " about?

Stories Rendered By Rambabu Kopparthy

How often does "కొప్పర్తి కథావాహిని " release new episodes?

"కొప్పర్తి కథావాహిని " publishes regularly with 106 episodes available. Check the episode list for the typical release schedule.

Where can I listen to "కొప్పర్తి కథావాహిని "?

You can listen to "కొప్పర్తి కథావాహిని " on PodParley by clicking any episode. We provide an embedded audio player for direct listening, and you can also subscribe via your preferred podcast app using the RSS feed.

Who hosts "కొప్పర్తి కథావాహిని "?

"కొప్పర్తి కథావాహిని " is created and hosted by Rambabu Kopparthy.
URL copied to clipboard!