అద్దేపల్లి ప్రభు గారి "అతడు మనిషి "కధ.  episode artwork

EPISODE · Jul 23, 2019 · 24 MIN

అద్దేపల్లి ప్రభు గారి "అతడు మనిషి "కధ.

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

కధాభిమానులకు నమస్కారం.🙏ఈ వారం మనం వినబోయే కథ "అతడు మనిషి ". రచయిత శ్రీ అద్దేపల్లి ప్రభు. మనిషి గొప్పదనాన్ని లోకానికి చాటి చెప్పేవి ఏవి ? . మాములుగా అంటే లోకసహజంగా ఆలోచిస్తే .....డబ్బు...హోదా,అధికారం . ఇంకొంచెం గట్టిగా ఆలోచన చేస్తే , చదువు , విజ్ఞానం , సామాజిక సంస్కారం . మరింత లోతుగా ఆలోచిస్తే కరుణ, దయ , ప్రేమ . ఒక్క మాటలో చెప్పాలి అంటే మనిషిని మనిషిగా చూడగలగడం. అయితే చివర్లో చెప్పిన ఈ "మనిషిని మనిషిగా చూడగలగడానికి " పైన చెప్పిన వాటిలో ఏది ఆవశ్యకమైన దినుసు అని ఆలిచిస్తే....డబ్బు , అధికారం , హోదా, చదువు , విజ్ఞానం , గొప్ప పరిసరాల్లో జీవించడం ఇవి ఏవీ కావు కేవలం "ఇంగిత జ్ఞానం" మాత్రమే అని మనసుని మేల్కొలిపి , హృదయాన్ని తట్టి చెప్పిన కథ "అతడు మనిషి ". ఒకానొక వానరాత్రి , చీకట్లో వరద వాతావరణం లో , జీవితంలో కష్టం , కన్నీళ్లు తెలీని మనిషికి ,ఒక నిరుపేద కుటుంబం, మానవత్వపు పరిమళాలను వెదజల్లే ఆతిధ్యం ఇచ్చి , ఆతిధ్యపు విలువను వెల కట్టకూడదు అనీ....."సాటి మనిషిని మనిషిగా చూసి కష్టకాలంలో ఆదరించగలగడం " మాత్రమే మానవీయ విలువలను నిలబెట్టడం అని జవాబు ఆశించకుండా ఒక పేదవాడు డబ్బున్న మారాజులకు విసిరిన సవాలు ఈ కధ. ఈ కధలో అతడు పేదవాడు కావచ్చు , కానీ అతడు మనిషి. వినండి అద్దేపల్లి ప్రభు గారి "అతడు మనిషి "కధ. 💐🙏మీ కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బాంక్ , విశాఖసాగరతీరం. ఫోన్ 96779015158.

Episode metadata supplied by the publisher feed · Published Jul 23, 2019

Embed this episode

NOW PLAYING

అద్దేపల్లి ప్రభు గారి "అతడు మనిషి "కధ.

0:00 24:30

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 24 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on July 23, 2019.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!