EPISODE · Nov 10, 2019 · 23 MIN
"అనుగ్రహం " . రచయిత శ్రీ పెనుమాక నాగేశ్వర రావు గారు
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
*కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం*💐🙏ఈ వారం మనం వినబోయే కథ "అనుగ్రహం " . రచయిత శ్రీ పెనుమాక నాగేశ్వర రావు గారు.మధ్యతరగతి జీవితాల్లోని వైవిధ్యాన్ని వివిధ కోణాల్లో ఆవిష్కరిస్తూ , దాదాపు నాలుగు దశాబ్దాలుగా రెండు వందలకు పైగా కథలు , నాలుగైదు నవలలు రచించారు.రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి.నివాసం గుంటూరు. ప్రస్తుత కథ అనుగ్రహం , విషయానికి వస్తే...మనలో చాలా మందికి దినఫలాలు , వారఫలాలు చూసుకునే అలవాటు ఉంటుంది.గ్రహగతుల్ని బట్టి , నక్షత్రాలను బట్టి రాశి ఫలాలు రూపొందిస్తారు. అదే జ్యోతిష్య శాస్త్రం.అందులో వాస్తవాలు ఎంత అనేది నేను తర్కించను.అది ఒక శాస్త్రంగా , సైన్స్ గా కూడా పరిగణింపబడుతూ ఉంది.అన్నిటిని మించి తిరుగులేని నమ్మకంగా ప్రజల జీవితాల్ని ప్రభావితం చేస్తున్నది . కథలో కూడా నవగ్రహాలలోని "శనీశ్వరుడి " అనుగ్రహాన్ని పొందిన నీలకంఠ శాస్త్రి జీవితం ఏ విధంగా మలుపు తిరిగిందీ.... కీడుకి ప్రతీకగా భావించే శని అనుగ్రహం ఆయనకి లభించి....జీవితం తుది దశలో ఆయన తన బద్దకాన్ని వదిలించుకుని , మందేశ్వరస్వామి (తూర్పుగోదావరి జిల్లా మందపల్లి లో దేవుడి పేరు ) అనుగ్రహ పాత్రుడు ఎలా అయ్యింది హత్తుకునేలా చెప్తారు రచయిత.కథ చదివి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం...."బద్దకం అతి పెద్ద దరిద్రం " దాన్ని వదిలించుకుని చైతన్య శీలిగా మనిషి జీవించిన నాడు.... గ్రహ గతులు మారుతాయి....జాతకం తిరగబడుతుంది....💐💐వినండి శ్రీ పెనుమాక నాగేశ్వర రావు గారి కథ "అనుగ్రహం "🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada.
Embed this episode
NOW PLAYING
"అనుగ్రహం " . రచయిత శ్రీ పెనుమాక నాగేశ్వర రావు గారు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.