EPISODE · Aug 2, 2019 · 15 MIN
"అపురూపం " రచయిత శ్రీ పంతుల జోగారావు
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కధాభిమానులకు నమస్కారం. ఈ వారం (26.01.2019 రిపబ్లిక్ డే రోజు ) మనం వినబోయే కథ "అపురూపం " రచయిత శ్రీ పంతుల జోగారావు.తెలుగు పండితులు.ప్రాచీన ఆధునిక సాహిత్యాలతో విశేషమైన పరిచయం కలిగిన ప్రతిభావంతులైన రచయిత.విస్తృతంగా కథలు,నవలలు,వ్యాసాలు రాశారు.1949 లో జన్మించిన వీరు 2007 లో పదవీ విరమణ చేసి ప్రస్తుతం విజయనగరంలో నివసిస్తున్నారు.300 కి పైగా కథలు రాశారు.అపురూపం,నేను మా అమ్మ , గోవు మాలచ్చికి కోటిదండాలు పేరుతో కథా సంకలనాలు వెలువరించారు.1966 లో ప్రారంభించిన రచనా వ్యాసంగా నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.ఇక ....కథ గురించి నాలుగు మాటలు. దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే కావాల్సింది ఏమిటి అని .....కలిసి సుఖంగా సంతోషంగా కాపురం చేసుకుంటున్న అనేక జంటలు పెళ్ళైన పాతికేళ్ల తరువాత కూడా అనేక సందర్భాలలో మధనపడడం చూస్తూ ఉంటాము.చిత్రంగా అనిపిస్తుంది కానీ వాస్తవం.సంసార జీవితం ప్రారంభించిన తొలినాళ్లలో భార్యాభర్తల మధ్య ఏర్పడే అవగాహనా పూర్వక స్నేహం దానికి పునాది.ఆ స్నేహంలో కొద్దిపాటి తేడాపాడాలు వస్తే ఇబ్బందే ! అటువంటి ఇబ్బందిని అధిగమించాలి అంటే కావాల్సింది ఏమిటి....భార్యాభర్తల మధ్య అనుకోని విధంగా మనస్పర్థలు తలెత్తితే ఏవిధంగా పరిష్కరించుకోవాలి అంటే...మంచి మనసు కలిగిఉండడం మాత్రమే మార్గం. రచయిత అంటారు....."లోకంలో అన్నిటికన్నా విలువైనది.... మలినం కారానిది...నిత్య హరితంగా కళ కళ లాడుతూ ఉండవలసింది మనసు . అటువంటి అపురూపమైన మనసుతో భార్యాభర్తలు కాపురం చేస్తే...కాలం గడిచేకొద్దీ....అన్యోన్య దాంపత్యం....ఆదర్శదాంపత్యంగా నిలుస్తుంది."అన్నివయసుల వారూ... ఆఖరికి షష్ఠి పూర్తి జరుపుకుని , మనవలు, మనవరాళ్లు కలిగి ఉన్న జంటలు కూడా నిక్షిప్తం చేసుకోవలసిన అపురూపమైన వస్తువు వేరేదో కాదు ....మనసు మాత్రమే అని చక్కగా చెప్పిన కథ అపురూపం .వినండి ఈ వారం కథ అపురూపం.💐🙏మీ కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బాంక్ , విశాఖ సాగరతీరం.
Embed this episode
NOW PLAYING
"అపురూపం " రచయిత శ్రీ పంతుల జోగారావు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.