Ash Tray Telugu Story by Chaganti Tulasi garu | "యాష్ ట్రే" - చాగంటి తులసి గారు. episode artwork

EPISODE · Nov 13, 2020 · 18 MIN

Ash Tray Telugu Story by Chaganti Tulasi garu | "యాష్ ట్రే" - చాగంటి తులసి గారు.

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి , కథాభిమానులకు నమస్కారం.🙏💐💐 ఈ వారం మనం వినబోయే కథ "యాష్ ట్రే " రచయిత్రి చాగంటి తులసి గారు. సాహితీ రంగంలో వారసత్వ సంపద అంది పుచ్చుకుని పుట్టిన కొంతమంది అదృష్టవంతుల్లో తులసి గారు ఒకరు. స్వర్గీయ చాగంటి సోమయాజులు (చా.సో ) గారి కుమార్తె. సాహిత్య వాతావరణంలో, వారి తండ్రిగారికి స్నేహితులైన శ్రీ శ్రీ , నారాయణ బాబు , రోణంకి, ఆరుద్ర ఇత్యాదుల మధ్య పెరిగిన రచయిత్రి. హిందీ సాహిత్యంలో డాక్టరేట్ పట్టా పొందారు. ఒడియా , హిందీ , ఇంగ్లీష్ , తెలుగు భాషల్లో అనువాద , స్వతంత్ర రచనలు చేశారు. వారి ప్రస్తుత కథ , యాష్ ట్రే....పెళ్లి విషయంలో స్త్రీకి స్వేచ్ఛ ఉండాలి , ఏ ఒత్తిడులకి లొంగ కూడదు....ఏ వయస్సులో అయినా కూడా అని తేల్చి చెప్పిన కథ. స్త్రీ జీవితానికి పెళ్లి పరమావధి కాదు , స్వతంత్రంగా జీవించి , ఉన్నతిని సాధించి , లోకానికి తాను ఏమిటో నిరూపించి చూపించిన ఒక స్త్రీ కథ. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకపోవడం , పరిస్థితులకు లొంగి పోకపోవడం , ఎదురొడ్డి నిలబడడం ఈ కథలో నాయిక లక్షణాలు. అభ్యుదయ భావాలు తులసి గారి ప్రతి రచనలోను ప్రతిఫలిస్తూ ఆమెను ఆమె తండ్రి చా.సో గారికి వారసురాలిగా నిలబెట్టాయి. తండ్రి గారి పేరు మీద ఏటా చాసో పురస్కారం అందిస్తున్నారు. ఈ కథ రికార్డ్ చెయ్యడానికి , ముందుగా విని సహృదయంతో సూచనలు చేసిన తులసి గారికి ప్రత్యేకంగా , కృతజ్ఞతలు , ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. వినండి , చాగంటి తులసి గారి కథ " యాష్ ట్రే " 🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada phone 96770 15158 Mail ID [email protected]

Episode metadata supplied by the publisher feed · Published Nov 13, 2020

Embed this episode

NOW PLAYING

Ash Tray Telugu Story by Chaganti Tulasi garu | "యాష్ ట్రే" - చాగంటి తులసి గారు.

0:00 18:10

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 18 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on November 13, 2020.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!