EPISODE · Aug 25, 2019 · 29 MIN
"అస్తిత్వానికి అటూ...ఇటూ ".రచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర.
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
కధాభిమానులకు నమస్కారం 🙏ఈ వారం మనం వినబోయే కథ "అస్తిత్వానికి అటూ....ఇటూ ". రచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర.ప్రసిద్ధ కథా రచయిత మధురాంతకం రాజారాం గారి కుమారుడైన నరేంద్ర , రచయితగా తొలి అడుగు తండ్రి జాడలో నడిచినా, క్రమేపీ తండ్రిగారి నీడ తన రచనా శైలి , వస్తువు,భావాల మీద పడకుండా స్వంతంత్ర రచయితగా ఎదిగారు.ఆయనతో నాకు ముఖపరిచయం.ఆయన మాటల్లోనే చెప్పాలి అంటే.... రచన ఆయనకు విలాస యాత్ర , విహార యాత్ర కాదు.సాహస యాత్ర.తాను వేసుకున్న బాట , తనదైన బాటలో నడవడం ఆయనకు ఇష్టం. వ్యక్తుల మరణానంతరం ఉత్తమ లోక ప్రాప్తి కోసం త్రివేణి సంగమంలో అస్థి నిమజ్జనం జరపడం హిందూ మత విశ్వాసాలలో బలమైన విశ్వాసం. అలహాబాద్ లో ఆ కార్యక్రమం జరిపించే తీరు కళ్ళకు కట్టినట్టు అస్తిత్వానికి" అటూ...ఇటూ "కథలో రాసుకొచ్చారు రచయిత.ఇద్దరు ప్రాణస్నేహితులు , జీవితం పట్ల భిన్న దృక్పధాలు కలిగి ఉన్నవారు , మృత్యువు గంగా ప్రవాహ రూపంలో వెల్లువగా తరుముకొస్తే తమ విశ్వాసాలను , నమ్మకాలను ఏవిధంగా మార్చుకున్నారో కథలో సూచించిన తీరు ఈ కథకు క్లాసికల్ రూపాన్ని , స్థాయిని తీసుకువచ్చింది.వినండి ఈ వారం కథ "అస్తిత్వానికి అటూ...ఇటూ ".రచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర.💐🙏మీ కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బాంక్ , విశాఖసాగరతీరం.
Embed this episode
NOW PLAYING
"అస్తిత్వానికి అటూ...ఇటూ ".రచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర.
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.