EPISODE · Oct 18, 2020 · 16 MIN
అత్తగారూ ఆవకాయ- రచయిత్రి: శ్రీమతి భానుమతీ రామకృష్ణ
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణాతీరం , విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.💐💐🙏 ఈవారం మనం వినబోయే కథ "అత్తగారు -ఆవకాయ " రచయిత్రి బహుముఖ ప్రజ్ఞాశీలి శ్రీమతి భానుమతీ రామకృష్ణ. భానుమతి గారి గురించి తెలియని తెలుగు వారు ఉండరు. బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న టైటిల్ కి సంపూర్ణంగా సరిపోయే స్త్రీ మూర్తి. నటిగా , గాయనిగా , దర్శక -నిర్మాతగా , రచయిత్రిగా , సినిమా స్టుడియో నిర్మాణ కర్తగా , తెలుగు వారు గర్వించదగ్గ "పద్మభూషణురాలు". తెలుగు వారు గర్వించదగ్గ ఆవిడకి "గర్వం" "అతిశయం"ఉన్నట్టు అనిపించడంలో తప్పు లేదు. ఆమెది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం. ఆమె అత్తగారి కథ ల్లో "అత్తగారి పాత్ర " ఒక 3D పాత్ర అని ప్రశంసించారు ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు. అత్తగారి కథలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రస్తుత కథ , అత్తగారూ ఆవకాయ విషయానికి వస్తే , నిమ్మకాయ పచ్చడి పెట్టడం కూడా రాని అత్తగారు , ఐదువేల మామిడి కాయల ఆవకాయ ఎలా పెట్టారో , ఆవిడ కోడలి మాటల్లోని విని తెలుసుకోవాలి. భానుమతి గారు వాస్తవానికి "కోడలి కథలు " రాయాలి, కానీ సహజ స్వభావం గల అత్తగారి పాత్రను వాస్తవిక రూపం కల్పించి సున్నితమైన హాస్యాన్ని పంచారు. ఆవిడ సినిమా జీవితం గురించి రాయాలి అంటే ఒక పుస్తకం రాయొచ్చు. అత్తగారి కథలు రాసిన భానుమతి గారి అమ్మగారి పేరు "సరస్వతి". వాళ్ళ అమ్మగారి గురించి , "నిజంగానే సరస్వతి "అని ఒక వ్యాసం రాసారు. బహుశా ఆమె ఆత్మకథ అనదగ్గ "నాలో నేను" అనే పుస్తకంలో అనుకుంటాను. అవే మాటలు భానుమతి గారికి వర్తిస్తాయి. సరస్వతి గారి కుమార్తె భానుమతి గారు "నిజంగానే సరస్వతి". ఆమె నా అభిమాన గాయని. వినండి ఈ వారం కథ శ్రీమతి భానుమతి గారి రచన "అత్తగారూ-ఆవకాయ" 🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Assistant General Manager Indian Bank Vijayawada Mail ID : [email protected]
Embed this episode
NOW PLAYING
అత్తగారూ ఆవకాయ- రచయిత్రి: శ్రీమతి భానుమతీ రామకృష్ణ
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.