EPISODE · Nov 4, 2019 · 12 MIN
అవ్వ తిరునాళ్ళలో తప్పిపోయింది.రచయిత కీ శే దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐 *కృష్ణా తీరం విజయవాడ నుండి కథాభిమానులకి నమస్కారం* ఈ వారం మనం వినబోయే కథ "అవ్వ తిరునాళ్ళలో తప్పిపోయింది.రచయిత కీ శే దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. భావకవిగా తెలుగు సాహిత్యంలో తనదైన స్థానాన్ని కలిగివున్న కృష్ణ శాస్త్రి గారు....సినీ గేయ కవిగా , ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టించుకున్నారు.తెలుగు సినిమాపాట కి ఆయనవల్ల కావ్య గౌరవం దక్కింది.ఆయన మాటలు పాటలు రాసిన మల్లీశ్వరి చిత్రం అజరామర సినీ దృశ్య కావ్యం. శాస్త్రి గారు కవిత్వం తో పాటు చక్కని వచనం కూడా రాసేవారు. వారి వచన రచనల్లో....పుష్ప లావికలు , అప్పుడు పుట్టివుంటే వంటి గొప్ప స్కెచెస్ ఉన్నాయి. శాస్త్రి గారు ఎన్ని కథలు రాశారో తెలీదు కానీ 1940 నాటి పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ రాసిన ఈ కథ "అవ్వ తిరునాళ్ళలో తప్పిపోయింది " తెలుగు నుడికారానికిగల సొగసులన్నీ , హాస్యంతో , వ్యంగ్య వైభవంతో రంగరించి రాసిన కథ. కథ ఏక వ్యక్తి సంభాషణగా సాగిన తీరు , ప్రారంభం నుంచీ తుదిదాకా....పెదవులపై చిరునవ్వులు పూయిస్తూనే ఉంటుంది. నిన్న శాస్త్రి గారి జయంతి. ఆయన్ను సంతోషంగా తల్చుకుంటూ ఇవ్వాళ ఈ కథ చదివి వినిపిస్తున్నాను. నిన్న నా కోరిక మేరకు ఒక మిత్రుడు ఈ కథను ఒక గ్రూప్ లో ఉంచాడు.అది సహజంగా సాహిత్యాభిలాషులు ఉన్న వేరే గ్రూపుల్లోకి చక్కర్లు కొట్టి ఉంటుంది.అయినా శాస్త్రి గారి తెలుగు పలుకుబడి శ్రోతలకు వినిపించాలి అనే తాపత్రయంతో ఈ కథ వినిపిస్తున్నాను. వినండి కీ శే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి కథ "అవ్వ తిరునాళ్ళలో తప్పిపోయింది "...💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు, Retd Asst General Manager, Indian Bank ,Vijayawada.
Embed this episode
NOW PLAYING
అవ్వ తిరునాళ్ళలో తప్పిపోయింది.రచయిత కీ శే దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.