EPISODE · Jul 27, 2019 · 9 MIN
"బోన్సాయ్ బ్రతుకు " కథ. రచయిత్రి శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
కధాభిమానులకు నమస్కారం. 🙏ఈ వారం మనం వినబోయే కథ "బోన్సాయ్ బ్రతుకు ". రచన కీ .శే. శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి. కొప్పర్తి కథావాహిని శ్రోతలకు శ్రీమతి ఛాయాదేవి పరిచితమైన పేరు.గతనెలలో, ఆమె చనిపోయే ముందు వారమే ఆమె కథ "స్పర్శ " వినిపించాను. ఆమె కథల్లో మనసుని తాకే అంశం "వాస్తవికత ". కథ చదివిన తరువాత కధాంశం ఏదైనా సరే , ఆమె చెప్పే తీరువల్ల "అవును కదా !" అనుకోకుండా ఉండలేము. అట్లాఅని ఎక్కువ ఆలోచించక్కర్లేదు. జీవితంలోని చిన్న చిన్న అంశాల్ని , చాలా సాదా సీదా శైలిలో ఒక హితోభిలాషి లాగా చెప్తారు. ఎదుగుదల మనిషికి , మొక్కకి ఏ విధంగా అవసరమో చెప్పిన ఈ కథ , ఆమె రాసిన గొప్ప కధల్లో ఒకటి. స్వేఛ్ఛా వాతావరణం మొక్కని , మనిషిని సమాజానికి ఏ విధంగా ఉపయోగపడేలా ఎదిగేలా చేస్తుందో ప్రతీకాత్మకంగా , కొద్దిలో చెప్పిన కథ. మొక్క ఎదుగుదలకు సారవంతమైన మట్టి కలిగిన భూమి కావాలి.మనిషి ఎదుగుదలకు చదువు భూమిక కావాలి.ఒక వృక్షం , సహజసిద్ధంగా ఎదిగి నేలలో వేళ్లూనుకుని బలంగా నిలబడితే ప్రకృతి సహజమైన అందాన్ని , చెట్టు ఉపయోగాన్ని ప్రజలందరూ అనుభవిస్తారు. చదువు స్త్రీని కూడా బలమైన శక్తిగా రూపుదిద్దడమే కాదు , కుటుంబానికి అండగా నిలబెడుతుంది అని సుతిమెత్తగా హెచ్చరిస్తూ ఒక సోదరి చేసిన హితబోధ ఈ కథ. ఆలోచనాశీలి అయిన రచయిత్రి శ్రీమతి ఛాయాదేవి ఆచరణాత్మకమైన సలహాలు , సూచనలతో కూడిన చక్కని కధలు మనకు సంపదగా మిగిల్చి వెళ్లారు. వినండి , "బోన్సాయ్ బ్రతుకు " కథ. రచయిత్రి శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి .💐💐మీ కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బాంక్ , విశాఖసాగరతీరం.
Embed this episode
NOW PLAYING
"బోన్సాయ్ బ్రతుకు " కథ. రచయిత్రి శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.