EPISODE · Feb 29, 2020 · 13 MIN
చా. సో గా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి సోమయాజులు గారి రచన "ఎందుకు పారేస్తాను నాన్నా "
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐 కృష్ణా తీరం విజయవాడ నుండి కథాభిమానులకి నమస్కారం.🙏 ఈవారం మనం వినబోయే కథ చా. సో గా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి సోమయాజులు గారి రచన "ఎందుకు పారేస్తాను నాన్నా ". ఉత్తరాంధ్ర రచయితల్లో అగ్రశ్రేణి రచయిత , అభ్యుదయ తెలుగుసాహిత్యానికి ప్రతినిధి అనదగ్గ కొద్దిమంది రచయితల్లో కీ.శే శ్రీ చా సో ఒకరు. గురజాడ, శ్రీ శ్రీ , ఆరుద్ర , రొణంంకి , రావి శాస్త్రి , కాళీపట్నం రామారావు గారు వంటి సాహితీ మూర్తులు జన్మించిన ఉత్తరాంధ్ర తీరపు, గొప్ప రచయిత స్వర్గీయ శ్రీ చా. సో. తెలుగులో మేలిమి ముత్యాలవంటి కథలు రాశారు. వారి కుమార్తె శ్రీమతి చాగంటి తులసి , కుమారుడు శంకర్ కూడా రచయితలు.ప్రస్తుత కథలోకి వస్తే....ఆర్థికంగా బలం లేని కుటుంబాలలో ప్రతిభ , తెలివితేటలు ఉండి కూడా చదువుకు నోచుకోలేని వారి సంఖ్య గతంలో ఎక్కువగా ఉండేది. అటువంటి ఒక పిల్లవాడి మనో వేదన మనకు వేదన కలిగే రీతిలో రాసిన కథ "ఎందుకు పారేస్తాను నాన్నా !" ప్రస్తుతం ప్రభుత్వాలు విద్యను అన్ని వర్గాల వారికీ అందుబాటులోకి తేవాలి అని, చదువుకోవడం ప్రాధమిక హక్కు అనే ఆలోచనతో చేపట్టిన అనేక పథకాలు కొంతవరకూ సత్ ఫలితాలను ఇస్తున్నాయి. గురుకుల పాఠశాలలు , నవోదయ విద్యాలయాలు , స్కాలర్షిప్పులు , ఫీజు రీయింబర్సుమెంట్ లు , విద్యారుణాలు చదువుకునే అవకాశాలను ఇతోధికంగా పెంచాయి. ఎంతో కొంత సత్ఫలితాలను ఇచ్చాయి. ఇస్తున్నాయి. ఒక బ్యాంక్ ఉద్యోగిగా ఉన్నత విద్యకు ఎంతో మందికి విద్యారుణాలను మంజూరు చేసే అదృష్టం నా మాతృసంస్థ ఇండియన్ బాంక్ ద్వారా ఆ భగవంతుడు నాకు ప్రసాదించిన వరం. ఈ కథ నా మనసులో చాలా రోజులనించి ఉన్నది. చాసో గారి , వాయులీనం , బొండు మల్లెలు కూడా గొప్ప కథలు.ఈ కథ 7 వ తరగతి పిల్లలకు పాఠ్యాంశంగా ఉన్నది అని విన్నాను. వాడ్రేవు సుందరరావు గారు షార్ట్ ఫిల్మ్ గా కూడా తీశారు. యు ట్యూబ్ లో చూడవచ్చు.గత నెల 17 వ తేదీ చా సో గారి జన్మదినం. వారిని స్మరించుకుంటూ..వినండి చా సో గారి కథ "ఎందుకు పారేస్తాను నాన్నా ! " 🙏 మీ కొప్పర్తి రాంబాబు Retd AGM Indian Bank Vijayawada Ph 96770 15158 Mail rambabuk. indianbankwms@gmail. com.
Embed this episode
NOW PLAYING
చా. సో గా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి సోమయాజులు గారి రచన "ఎందుకు పారేస్తాను నాన్నా "
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.