EPISODE · Jun 6, 2020 · 27 MIN
"చిట్ట చివరి సున్నా " రచయిత శ్రీ భగవంతం
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 🙏. ఈ వారం మనం వినబోయే కథ "చిట్ట చివరి సున్నా " రచయిత శ్రీ భగవంతం. రచయిత శ్రీ భగవంతం అసలుపేరు నరసింహారావు. భగవంతం కలం పేరు. ప్రత్యేకించి ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే...ఈ రచయిత తన కలంపేరుని వేరొక ప్రసిద్ధ రచయిత రాసిన కథలోని పేరుని తన కలం పేరుగా పెట్టుకున్నారు.ఆ ప్రసిద్ధ రచయిత శ్రీ త్రిపుర. ఆయన కథల్లో "భగవంతం కోసం " అనేది గొప్ప కథ. ఒక రచయిత వేరొక రచయితని ఏ మేరకు influence చేస్తాడో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. శ్రీ భగవంతం కవి, కథారచయిత. చిట్టచివరి సున్నా...కథ పరిశీలిస్తే ఒక ఆలోచనా శీలి అయిన వ్యక్తి మనకు కథలో దర్శనమిస్తాడు.అది రచయితే ! మనసు లోతుల్లోకి అన్వేషణ కథలో అంశం. ఆ అన్వేషణ బాహ్యప్రపంచానికి పైకి సరదాగా కనిపించినా అందులో లోతైన ఆలోచన ఉన్నది. ఒక హోటల్ సర్వర్ ని తాత్వికుడు అని పేర్కొనడం వెనుక అర్థం...అతడి జీవితంలోని విషాదాన్ని మనముందు పరిచేముందు...అతడిని ఆ విధంగా పరిచయం చేస్తాడు. మనం తెలుసుకోవాల్సిన విషయాన్ని....తను వెతికి చూపించినట్టు కథను సృష్టించి , మనకి గ్రహింపుకి తీసుకువస్తాడు...రచయిత. వర్తమానంలో మనం చేసే పనులు మనకి ఆనందాన్ని ఇస్తాయా.... దుఃఖ హేతువులు అవుతాయా అన్నది ఒక తెలియని వెతుకులాట అని మనకి తెలియచేస్తారు ఈ కథలో రచయిత. ఈ కథ పై మీ అభిప్రాయాన్ని రచయిత ఫోన్ నెంబర్ 93993 28997 కి గానీ నాకు గానీ తెలియచేయండి. వినండి ఈ వారం కథ "చిట్ట చివరి సున్నా " శ్రీ భగవంతం రచన. 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada Ph 96770 15158 Mail [email protected]
Embed this episode
NOW PLAYING
"చిట్ట చివరి సున్నా " రచయిత శ్రీ భగవంతం
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.