EPISODE · Aug 2, 2019 · 21 MIN
"చివరిపిచ్చుక " రచన శ్రీ పాపినేని శివశంకర్
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
కథాభిమానులకి నమస్కారం.ఈ వారం మనం వినబోయే కథ "చివరిపిచ్చుక " రచన శ్రీ పాపినేని శివశంకర్.శ్రీ పాపినేని ప్రాధమికంగా కవి.ఆయన కధల్లో కవితాలక్షణం ఎక్కువ.కథన శైలి కవితాత్మకంగా ఉంటుంది....అనేది మరొక ప్రముఖ కవి శివారెడ్డి గారి అభిప్రాయం.ఈ అభిప్రాయం నిస్సందేహంగా అంగీకరించవలసిందే ! ఆయన నా అభిమాన రచయిత. చివరి పిచ్చుక కధ చదవడంలో నేను కొంత భావోద్వేగానికి గురిఅయ్యాను. అది నా గుండెలోనుండి గొంతులోకి పాకకుండా ఆపలేకపోయాను. పిచ్చుకలు అమాయకపు పిట్టలు.మిగతా ఏ పక్షిని చూసినా కలగని ప్రేమ పిచ్చుకని చూస్తే కలుగుతుంది.రూపం ,కదలికలు , మనకి దగ్గరగా వస్తూనే దూరంగా జరగడం , ఇంట్లో వాకిట్లో తిరుగాడుతూ మన చిన్నతనంలో మనల్ని అలరారించిన ఆ చిన్ని పక్షులు ఈనాడు సెల్ టవర్ల రేడియేషన్ ప్రభావానికి అంతరించే స్థితికి చేరిపోయాయి.మన చిన్నతనంలో తిరుగుతున్న సీఈలింగ్ ఫ్యాను కి కొట్టుకుని రెక్కలు తెగి పడిన పిచ్చికని చూసి ఎంతో బాధపడేవాళ్ళం.అద్దంపై వాలి అద్దంలో వాటి రూపు చూసుకుని అమాయంగా ముక్కుతో ప్రతిబింబాన్ని పొడుచుకునే పిచ్చికల్ని చూసాము.పిచ్చుకల్ని మనఇంట్లో మనతో కలిసి మెలసి జీవించే నేస్తాలుగా నిలుపుకోలేకపోయాము. ప్రతి ఏటా మార్చ్ 20 వ తేదీ World Sparrow Day గా మనం జరుపుకునేది పిచ్చుకల జన్మదినమా ? లేక మానవాళి సాధించిన సాంకేతిక పురోగతి వాటికి రాసిన మరణ శాసన దినమా అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు.
Embed this episode
NOW PLAYING
"చివరిపిచ్చుక " రచన శ్రీ పాపినేని శివశంకర్
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.