EPISODE · Jul 23, 2019 · 10 MIN
"చంద్రహారం ". రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి.
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
కధాభిమానులకు నమస్కారం.🙏ఈ వారం మనం వినబోయే కథ "చంద్రహారం ". రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి.కొందరు రచయితలకు ఒకటి రెండు రచనల వల్ల కొన్ని ముద్రలు పడిపోతాయి. అట్లా హాస్య రచయిత్రిగా ముద్ర పడిన రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారు.దాదాపు పదిహేనేళ్ల క్రితం రాసిన ఈ కథ "చంద్రహారం " ఈ మధ్యనే చదివాను.ఈ కథతో పాటు ఆమె మరికొన్ని కథలు చదివాను. ఆమె కధల్లోని ఆర్ద్రత నన్ను కదిలించింది. ఆడవాళ్లు బంగారం పట్ల మితిమీరిన ఇష్టాన్ని కలిగి ఉంటారని , "ఏడు వారాల నగలతో " కూడా సంతృప్తి చెందరనీ అంటూ....వింటూ ఉంటాము. కానీ అది తప్పు అని ఒక నగ.... ఆభరణం మాత్రమే కాదు , కుటుంబాన్ని కష్టంలో ఆదుకునే వనరు అనీ "చంద్రహారం "కథలో ఆమె ప్రతిపాదించిన తీరు అద్భుతం. కథలోని మామ్మ భావాలకు వారసుడు ఆమె మనుమడు , ఆమె భర్త పేరు పెట్టుకున్న "చిన్న రామచంద్రయ్య ". చంద్రహారం మామ్మకు ప్రతిరూపం గా భావించి , రూపు చెడకుండా , ఆమె తరువాతి తరానికి అందేలా చేసిన మెత్తటి మనసున్న మనుమడు.వృత్తి రీత్యా బాంక్ ఉద్యోగిని కాబట్టి....గోల్డ్ లోన్స్ కి వచ్చే "స్త్రీ ధనం "....బాలతొడుగులు.... ఎన్ని కుటుంబాల్ని ఆర్ధిక అవసరాలకి సరైన సమయంలో , సరైన రీతిలో ఆదుకుంటున్నాయో, భార్య ఒంటిమీద నగలు కేవలం భర్త సంపాదనకు చిహ్నాలు కావు అవి కుటుంబ అవసరాల్ని తీర్చే కామ ధేనువులు, కల్పవృక్షాలు అని కూడా గమనించాలి అని తెలిపేందుకు ఈ కథ వినిపిస్తున్నాను.🙏మీ రాంబాబు కొప్పర్తి , ఇండియన్ బాంక్ , విశాఖ సాగరతీరం.
Embed this episode
NOW PLAYING
"చంద్రహారం ". రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి.
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.