"చంద్రవంక ". రచయిత డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి  episode artwork

EPISODE · Aug 1, 2019 · 16 MIN

"చంద్రవంక ". రచయిత డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

కధాభిమానులకు నమస్కారం 💐ఈ వారం (25.5.2019) మనం వినబోయే కధ "చంద్రవంక ". రచయిత డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి గారు. తెలుగు కథ , ప్రత్యేకించి తెలుగు భాష మీద , మాండలికాల మీద గొప్ప పట్టు సాధించిన వ్యక్తి డాక్టర్ దక్షిణామూర్తి. వారు ఈ కథలో ఒకానొక విపత్తుని , ప్రళయాన్ని , కృష్ణానది వరదతో తన పరీవాహక ప్రాంతంలోని ఒక ప్రదేశాన్ని ముంచెత్తి తుడిచిపెట్టివేసిన విషాద దృశ్యం నేపథ్యంగా ఈ కథ రాశారు. ఒక ప్రళయం ఎందుకు సంభవిస్తుంది ? జీవన విలువలు నశించినప్పుడా ? సంప్రదాయాలు , ఆచారాలు మంటకలిసినప్పుడా ? అనే ఒక ప్రశ్నను తన కుటుంబ పరంగా సంధించి ఆలోచించి , ప్రళయ ప్రవాహ వేగంతో సాగే ఆలోచన ప్రవాహంలో అద్భుతమైన భావధారలో పాఠకుల్ని ముంచెత్తి....అంతిమంగా రేపటి యుగపు ప్రతినిధిగా మనుమడిని బుట్టలో ఉంచి అనంత జలరాశిలోకి ఉపనిషత్తులు, యోగశాస్త్రం,భగవత్గీత ,బ్రహ్మసూత్రాలు , వైద్యశాస్త్ర గ్రంధం వంటి వాటితో యజ్ఞోపవీతంతో బంధించి వదులుతాడు.మనిషి మనిషిగా విలువలు నశించకుండా బ్రతికెట్టు చెయ్యమని దైవాన్ని ప్రార్ధిస్తాడు . వంశాంకురమైన ఆ పసిపాపడిని వరదప్రవాహంలోకి వదిలి ఆయన "ఆత్మ సన్యాసం "స్వీకరిస్తాడు. గుండెను పిండేసే విషాదం అది. 1964, సెప్టెంబర్ 30 వ తేదీ యదార్ధంగా చంద్రవంక వాగు పొంగి మాచర్ల పట్టణాన్ని ముంచెత్తింది.కథలో రచయిత మానవీయ విలువల్ని ప్రతిపాదించిన తీరు , సమయం , సందర్భం ఈ కథ మీకు వినిపించాలి అనుకోడానికి ప్రధాన కారణం. వినండి డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి గారి కథ "చంద్రవంక " 🙏మీ కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బ్యాంక్ , విశాఖసాగరతీరం.

Episode metadata supplied by the publisher feed · Published Aug 1, 2019

Embed this episode

NOW PLAYING

"చంద్రవంక ". రచయిత డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి

0:00 16:39

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 16 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on August 1, 2019.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!