"ఏమిసంబంధము " . రచన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు episode artwork

EPISODE · Dec 4, 2019 · 15 MIN

"ఏమిసంబంధము " . రచన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

💐💐కథాభిమానులకు నమస్కారం 🙏 *ఈ వారం మనం వినబోయే కథ "ఏమిసంబంధము " . రచన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు* జ్ఞానపీఠ బహుమతి పొందిన శ్రీమద్రామాయణ కల్పవృక్షం కావ్యము, వేయిపడగలు , ఏకవీర , చెలియాలికట్ట వంటి నవలలు , విశ్వనాథ మధ్యాక్కరలు , కిన్నెరసాని పాటలు , ఋతుసంహారం గేయ కావ్యం ఇలా శతాధిక గ్రంథకర్త అయిన మాహానుభావుని కథ ఈ వారం వినిపించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. విశ్వనాథ వారి చిన్నకథలు చదివితే , ఛాందస వాదిగా ఆయనకు ఎలా ముద్ర వేశారో అర్థం కాదు. సరళ గ్రాంధికంలో రాసిన ప్రస్తుత కథ "ఏమి సంబంధము " ప్లేటోనిక్ లవ్.... అనదగ్గ....అమలిన ప్రేమ భావనను అత్యంత సున్నితంగా హృదయానికి చేరువ అయ్యేలాగా చెప్పిన కథ.కల్పిత కథ అంటే నమ్మశక్యం కాదు.కారణం కథలో ఆయన సృష్టించిన పాత్రలు , సంఘటనలు , సమయాలు, సందర్భాలు అన్నీ కూడా సహజత్వానికి అతి దగ్గరగా...నిజంగా జరిగిన కథే అనిపిస్తుంది. వాస్తవ చిత్రణకి ఈ కథ అద్దం పడుతుంది. కథ చదివిన తరువాత మనసు మూగ వేదనకు గురి అవుతుంది. ఒక ప్రేమ కథను విశ్వనాథ వారు తమదైన రీతిలో అత్యంత సంస్కారభరితంగా చెప్పిన తీరు, కథ పేరులో ఉన్న వైరాగ్య భావన, ఆ మహానుభావుడికి చేతులెత్తి నివాళి అర్పించే విధంగా ఉంది ఈ కథ. ఆయన తిరుగాడిన విజయవాడలో , వారి ఇల్లు కల్ప వృక్షము ఉన్న మారుతినగర్ కి అతి సమీపంలో నివసిస్తూ వారి కథ చదివి వినిపించడం నాకు భగవంతుడు ఇచ్చిన వరం. వినండి విశ్వనాథ వారి ప్రేమకథ "ఏమిసంబంధము ".🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada. Ph 96770 15158.

Episode metadata supplied by the publisher feed · Published Dec 4, 2019

Embed this episode

NOW PLAYING

"ఏమిసంబంధము " . రచన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు

0:00 15:30

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 15 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on December 4, 2019.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!