"గోధూళి వేళ " , రచయిత్రి శ్రీమతి పి.సత్యవతి episode artwork

EPISODE · Mar 8, 2020 · 16 MIN

"గోధూళి వేళ " , రచయిత్రి శ్రీమతి పి.సత్యవతి

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ సందర్భంగా , ఈ వారం మనం వినబోయే కథ "గోధూళి వేళ " , రచయిత్రి శ్రీమతి పి.సత్యవతి. సత్యవతి గారు ప్రముఖ రచయిత్రి. స్త్రీల సమస్యలను ఎంతో స్పష్టంగా అర్థం చేసుకుని , రచనలు చేస్తారు. ఆమె కథ చెప్పే తీరులో గొప్ప శిల్ప చాతుర్యం ఉంటుంది. సాదాసీదా శైలిలో కథలు రాసే ఆమె , ఎంతో స్పష్టమైన భావాలను వ్యక్తం చేస్తారు. గోధూళి వేళ కథలో రచయిత్రి ఒక చోట , ఉదయం నించి రాత్రి దాకా రోజు మొత్తంలో ఎన్ని వేళలు ఉంటాయో సరదాగా రాసుకొచ్చారు. గోధూళి వేళను ఆవులు ఇంటికి చేరే వేళ అని మాత్రమే కాకుండా....స్త్రీలకు ప్రతీకాత్మకంగా మార్చి....ఉద్యోగస్తులు అయిన స్త్రీలు ....సాయంవేళ చీకటి పడేసరికి ఇల్లు చేరుకోవాలి అని కోరుకుంటారు....ఎందుకంటే వారికోసం ఇంటివద్ద లేగ దూడల వంటి చిన్న పిల్లలు ఎదురుచూస్తుంటారు , సంసారబాధ్యతలు ఎదురుచూస్తుంటాయి అని చెప్పి కథను ముగించడం , వివిధ రంగాలలోని స్త్రీలు వేళకు ఇల్లు చేరడంలో సమాజం ఎంతగా ప్రాముఖ్యత చూపుతుందో వివరించడం ద్వారా , స్త్రీ వాదిగా సమస్యను మనముందు ఉంచిన తీరు ఆమె స్త్రీల సమస్యను ఎంత స్పష్టంగా అర్థం చేసుకుంటారో తెలుసుకోవచ్చు. ఒక విశేషం ఏమిటి అంటే....ఈ రోజే ఆమెను వారి ఇంట్లో కలుసుకుని ఆమె రాసిన కథను ఆమెకు వినిపించాను.అది నా అదృష్టం. వినండి శ్రీమతి పి సత్యవతి గారి కథ " గోధూళి వేళ " 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు Retd AGM Indian Bank Vijayawada phone 96770 15158 Mail rambabuk. indianbank wms @gmail. com

Episode metadata supplied by the publisher feed · Published Mar 8, 2020

Embed this episode

NOW PLAYING

"గోధూళి వేళ " , రచయిత్రి శ్రీమతి పి.సత్యవతి

0:00 16:03

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 16 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on March 8, 2020.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!