EPISODE · Jul 31, 2019 · 18 MIN
*గృహోన్ముఖం - రచన శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు*
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
*కథాభిమానులకి నమస్కారం.🙏ఈ వారం మనం వినబోయే కథ *గృహోన్ముఖం - రచన శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు* శ్రీ చినవీరభద్రుడు అత్యంత ఆలోచనా శీలి అయిన రచయిత.ఆయన కథ , కవిత్వం , వ్యాసం ఏది రాసినా ఒక నూతన దృక్కోణంలో సునిశిత పరిశీలన ఉంటుంది.తప్పనిసరిగా ఒక తాత్విక భావన తొంగి చూస్తుంది.భావాల్లోని సున్నితత్వం భాషలో కూడా ఒదిగేలాగా , గుండెని గుప్పిట్లో పట్టుకునే పదాలతో రాయడం ఆయన శైలి.ఆయన రచయిత మాత్రమేకాదు.... చిత్రకారుడు కూడా ! అందుకే తన శైలితో, భాషతో పదచిత్రాలు చిత్రిస్తారు.నిర్వికల్ప సంగీతం , ఒంటరి చేలమధ్య ఒక్కత్తే మన అమ్మ , నీటిరంగుల చిత్రం , పునర్యానం, సహృదయునికి ప్రేమలేఖ , సాహిత్య సంస్కారం, కొన్ని కలలు కొన్ని మెళకువలు - సార్వత్రిక విద్యతో నా అనుభవాలు ఆయన రచనల్లో కొన్ని.*ఈ వారం ఈ కథ ఇప్పటిదాకా వినిపించిన కథల కన్నా భిన్నమైన కథ అనుకుంటున్నాను* మనల్ని మనం కోల్పోవడం జరిగి , ఆ విషయాన్ని హఠాత్తుగా తెలుసుకుని , తిరిగి కోల్పోయిన జీవితాన్ని పొగుచేసుకోడం సాధ్యమా ? అని ప్రశ్నించుకుంటే , సాధ్యమే అని సమాధానం దొరికి , మనదైన జీవితానికి దారి చూపించే కథ .జీవితంలో అనుభవాలకన్నా , అనుభూతులే విలువైనవి అని వివరించి చెప్పే కథ. పోగొట్టుకున్న బాల్యాన్ని తిరిగి రాబట్టుకోడం సాధ్యం కాకపోయినా , వయసు పెరిగి , బాధ్యతల బరువు మీద పడినా , స్పందన కోల్పోనవసరం లేదు అని ఒక వ్యక్తి వ్యక్తంచేసిన భావ పరంపర ఈ కథ. కథలోని తాత్వికత , కథానాయకుడి భావుకత , ఆలోచనల్లోని లోతు మనల్ని ఆపి , కొంచెం గాఢంగా ఊపిరి తీసుకునేలాగా చేసి , బ్రతుకులోని మాధుర్యాన్ని కోల్పోకూడదు అని నిర్ణయించుకునేలాగా , ఆలోచింపచేసే కథ. తాత్విక చింతన అంతర్లీనంగా ....పూసల దండలో దారం లాగా కదలాడే కథ. వినండి.....💐🙏మీ కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బాంక్ , విశాఖసాగరతీరం.
Embed this episode
NOW PLAYING
*గృహోన్ముఖం - రచన శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు*
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.