EPISODE · May 6, 2020 · 17 MIN
గురజాడ వారి దిద్దుబాటు & శ్రీ శ్రీ గారి....అశ్వమేథయాగం
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐 *కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం* అందరూ ఇళ్లకు పరిమితమై....కరోనా విషయంలో జాగ్రత్త వహిస్తూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. *ఈవారం ఇద్దరు మహాకవుల కథలు....వినిపిస్తున్నాను. ఒకరు గురజాడ....మరొకరు శ్రీ శ్రీ.....* ఇద్దరూ మహాకవులే ! శ్రీ శ్రీ గారు గురజాడకు వీరాభిమాని. "అడుగుజాడ గురజాడది... అది భావికి బాట....మనలో వెధవాయత్వం మరపించే పాట " అంటారు. *మొదటి కథ గురజాడ వారి దిద్దుబాటు* తొలి నాటి తెలుగు కథల్లో ఒకటి. సన్నివేశ ప్రధానమైన కథ.కథలోని నాయకుడు వేశ్యా వాటికకు ఆట పాటలు చూడడానికి వెళ్లిన ఒక సదయ సహృదయుడు. తప్పు చేసినా దిద్దుబాటు చేసుకోగల జ్ఞానం ఉన్న మనిషి .సృష్టిలోకెల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్త్రీ...అనీ...బెటర్ హాఫ్ అంటే....పెళ్లాము మొగునికన్న దొడ్డది అనే గ్రహింపు కలిగిన వ్యక్తి. చెడు అలవాట్లు చేసుకుని భార్యను బాధించకూడదు అనే ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి.అందువల్ల కథ సుఖాంతము అయ్యింది. *రెండవ కథ శ్రీ శ్రీ గారి....అశ్వమేథయాగం.* వ్యసనాలకు బానిస అయిన వ్యక్తి తల్లి మరణ శయ్యపై ఉన్నదన్న వార్తను తెచ్చిన టెలిగ్రామ్ అడ్డుపెట్టుకుని....అప్పు పుట్టించుకుని ... గుర్రపు పందేలు ఆడి.... వ్యక్తి పతనానికి వ్యసనం ఏ విధంగా దారితీస్తుందో... వ్యధా భరితంగా చెప్పిన కథ. శ్రీ శ్రీ గారి కవితల్లో కనిపించే పతితుడు... భ్రష్ఠుడు...కథలోని వెంకటరావు. రెండుకథల్లోని హీరోల ఆలోచనా ధోరణుల్ని గమనిస్తే...మంచి-చెడు అనేవి మనస్సుని అదుపులో పెట్టుకోడం ద్వారా సాధించవచ్చు అని బోధిస్తాయి. వినండి ఇద్దరు మహా కవుల కథలు. 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada. Ph 96770
Embed this episode
NOW PLAYING
గురజాడ వారి దిద్దుబాటు & శ్రీ శ్రీ గారి....అశ్వమేథయాగం
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.