"హైలీ కమాండబుల్ సర్టిఫికెట్ " రచయిత డాక్టర్ నక్కా విజరామరాజు  episode artwork

EPISODE · Sep 21, 2019 · 13 MIN

"హైలీ కమాండబుల్ సర్టిఫికెట్ " రచయిత డాక్టర్ నక్కా విజరామరాజు

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

కథాభిమానులకు నమస్కారం 💐🙏. ఈ వారం మనం వినబోయే కథ "హైలీ కమాండబుల్ సర్టిఫికెట్ " రచయిత డాక్టర్ నక్కా విజరామరాజు. ఈ కథ ఆయన రాసిన "భట్టిప్రోలు కథలు " కథా సంకలనం లోనిది.అమరావతి కథల్లాగా అన్నీ మంచి కథలున్న ఆ కథాసంకలనం లోంచి ఏ కథ ఎంచుకోవాలో సమస్య అయ్యింది. ఆఖరికి బాల్యానికి సంబంధించిన ఈ కథ ఎంచుకున్నాను.కారణం మన అందరికి బాల్యం మధురమైనది. బాల్య జ్ఞాపకాలు మధురతరమైనవి.బాల్యం కన్నా రుచిగా ఉండేది బాల్యం గురించిన జ్ఞాపకాలు.అలా నేను పుట్టి పెరిగిన తెనాలి, కొల్లూరు ప్రాంతాల్లో నిజ్జంగా జరిగిన విషయాల్ని గుర్తుకు తెస్తూ రాసిన ఈ కథలో పాత్రలు అందరూ నాకు తెలీకపోయినా డ్రాయింగ్ మాస్టారు వెల్లటూరి పూర్ణానంద శర్మ గారు నాకు బాగా జ్ఞాపకం.చిన్నపుడు ఒకటి రెండుసార్లు ఆయన్ని చూశాను ఈ కథలో రచయిత నాన్నమ్మ , తన మనుమడికి డ్రాయింగ్ పోటీలో బహుమతి వస్తే ఆ విషయాన్ని మొదటగా మనవడు చెప్తే పట్టించుకొనట్టు కనిపించి ఆ తర్వాత ఇరుగు పొరుగులతో ఎంత ఘనంగా పార్టీ చేసుకుందో గమనించిన రచయితకు మనసు పొంగిపోతుంది, ఆమె ప్రేమకు. కథలోని విషయం చిన్నదే అయినా , తెలుగు వారికే ప్రత్యేకమైన ఇంటి పేర్లతో సహా పాత్రలను పరిచయం చేసి ,అత్యంత సహజంగా కథను రూపొందించిన విధం మనలో ప్రతి ఒక్కరినీ , ముఖ్యంగా పల్లెటూరి జిల్లాపరిషత్ స్కూళ్లలో చదువుకున్న వాళ్ళని "పంచ రంగుల "తీపి జ్ఞాపకాలలోకి తీసుకువెళ్తుంది ఈ కథ. వినండి డాక్టర్ నక్కా విజయరామరాజు గారి కథ Highly Commendable Certificate.💐🙏మీ కొప్పర్తి రాంబాబు , విశ్రాంత ఉద్యోగి , ఇండియన్ బ్యాంక్ , విశాఖసాగరతీరం.

Episode metadata supplied by the publisher feed · Published Sep 21, 2019

Embed this episode

NOW PLAYING

"హైలీ కమాండబుల్ సర్టిఫికెట్ " రచయిత డాక్టర్ నక్కా విజరామరాజు

0:00 13:53

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 13 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on September 21, 2019.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!