EPISODE · Aug 1, 2019 · 19 MIN
"ఇచ్చట విడాకులు ఇవ్వబడవు " . రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి.
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
ఈ శనివారం 5.1.2019 వినిపించబోయే కథ "ఇచ్చట విడాకులు ఇవ్వబడవు " . రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి. పొత్తూరి విజయలక్ష్మి గారు ముప్ఫై ఏళ్ల క్రితం ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన శ్రీవారికి ప్రేమలేఖ సినిమాకి కథ అందించిన హాస్య రచయిత్రి.పాఠకుల్ని హాయిగా నవ్వుకునేలాగా గిలిగింతలు పెట్టే హాస్యరచనలు చేయడం విజయలక్ష్మి గారి ప్రత్యేకత.ఆవిడ రచనలు మనతో మాట్లాడుతాయి. ఆవిడది శబ్దాశ్రయ హాస్యం కాదు.భావ ప్రధానమైన హాస్యం.నవ్వించే చాతుర్యం ఆవిడకి సహజాభరణం.... అన్న కవన శర్మ గారి మాటలు అక్షరాల నిజం అనిపిస్తాయి...పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు పేరుతో వచ్చిన ఆమె కథల సంకలనం లోని కథలు చదివితే ."ఇచ్చట విడాకులు ఇవ్వబడవు " కథలో భార్యా భర్తల్ని గమనిస్తే When a man retires his wife gets a full time husband with part salary అన్న మాటల్లో ఎంతటి హాస్యపు హెచ్చరిక దాగి ఉందో తెలుస్తుంది.క్రితం వారం పెళ్లి చూపులు....ఈ వారం విడాకులు ఏమిటి అని కంగారు పడకండి.....ఈ కథ లో హాస్యంతో పాటు చక్కని సందేశం కూడా ఉంది.అంతే కాదు ఉన్న నాలుగు పాత్రల్లోనూ కథ నడిపించింది ఇద్దరే ! వాళ్ళ మాటల ప్రవాహంలో మనల్ని ముంచెత్తి మనల్ని గుక్క తిప్పుకోనివ్వరు. తెలుగు భాషకి సొగసు చేకూర్చే ఆభరణాలు తెలుగు సామెతలు....అవి విడాకులు కోరే భార్యాభర్తల నోటి నుంచి దెప్పి పొడుపుల్లాగా వచ్చి మనల్ని నవ్విస్తాయి. కథ టైటిల్ చూస్తేనే తెలుస్తుంది....భారతీయ వివాహ వ్యవస్థకి ప్రత్యామ్నాయం లేదని చెప్తూ....మన వివాహ వ్యవస్థలోని గొప్పతనాన్ని మనసుకి పట్టుకునేలా చేస్తుంది.ఆలకించండి...."ఇచ్చట విడాకులు ఇవ్వబడవు " 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు, విశాఖ సాగరతీరం.
Embed this episode
NOW PLAYING
"ఇచ్చట విడాకులు ఇవ్వబడవు " . రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి.
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.