EPISODE · Sep 30, 2019 · 22 MIN
"ఈవెంట్ మేనేజర్ ". రచయిత్రి కీ.శే. డాక్టర్ సోమరాజు సుశీలగారు
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐 కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ "ఈవెంట్ మేనేజర్ ". రచయిత్రి కీ.శే. డాక్టర్ సోమరాజు సుశీలగారు.ఈ కథ ఎప్పుడో వినిపించాల్సిన కథ. ఇలా ఆమె కు నివాళిగా వినిపించవలసి వస్తుంది అని ఊహించలేదు.అట్లాఅని ఊరుకోవడానికి మనసు ఒప్పుకోలేదు.దివికేగిన ఆమె దీవెనలు పొందడానికి ఈ కథ చదువుతున్నాను.ఆమెను చూసి మాట్లాడే భాగ్యం కలగకపోయినా , ఆమె రచనలు చదువుతూ ఉంటే ఆమె మనతోనే ఉన్నట్టు , కబుర్లు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు "అయిన సంబంధాలు "చేసుకోడం....మేనరికాలు కలుపుకోవడం సంప్రదాయంగా ఉండేది. జన్యు పరంగా రక్త సంబంధం ఉన్నచోట వివాహాలు మంచివి కావు అని వైద్యరంగంలోని వారు హెచ్చరిస్తుండడం వల్ల బాగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది.బంధుత్వాలు, బాంధవ్యాలు, నిలబడటానికి మేనరికాలు ఎంతో మేలు చేసేవి అన్న మాటమాత్రం విస్మరించలేని విషయం. ప్రస్తుతకథలో ఆనాటి కుటుంబాల్లో దగ్గరతనం ఎలా ఉండేదో చెప్తూ....ఆర్థ బలం లేక పోయినా, బంధుత్వంలో ఉండే బలాన్ని ఆసరాగా చేసుకుని ఒక బామ్మ గారు తన మనవరాలి పెళ్లి ఈవెంట్ ని ఎంత సమర్థవంతంగా నిర్వహించిందీ ఈ కథ తేటతెల్లం చేస్తుంది.డబ్బు ప్రధానం కాదు, ఆప్యాయత , వ్యక్తిగత సమర్థత ఉంటే అవి మానవ సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి అని కథలో అలనాటి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు "ఈ కాలంలో మళ్ళీ తమ మనుమరాలి పెళ్లి ఈవెంట్ లో ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్టు కథ ముగించడం ద్వారా కీ శే సోమరాజు సుశీల గారు...."మానవ సంబంధాల "లోని పూర్వపు విలువలు నిలబడాలి అని కోరుకున్నట్లు స్పష్టమవుతుంది.వినండి ఈ వారం కథ "ఈవెంట్ మేనేజర్ .....కీ శే శ్రీమతి సోమరాజు సుశీల గారు.💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , విశ్రాంత ఉద్యోగి , ఇండియన్ బ్యాంక్ , విశాఖసాగరతీరం.
Embed this episode
NOW PLAYING
"ఈవెంట్ మేనేజర్ ". రచయిత్రి కీ.శే. డాక్టర్ సోమరాజు సుశీలగారు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.