EPISODE · Oct 18, 2020 · 14 MIN
జ్ఞానపీఠ బహుమతి గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ గారి రచన - " ఒక ఎలుక కథ ".
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏🏻💐💐 ఈ వారం మనం వినబోయే కథ "ఒక ఎలుక కథ " రచయిత శ్రీ రావూరి భరద్వాజ . రచయితగా ఏమాత్రం పరిచయం చెయ్యవలసిన అవసరం లేని మహా రచయిత శ్రీ రావూరి భరద్వాజ.సమాజాన్ని నిశితంగా పరిశీలించి మంచి చెడులను విస్పష్టంగా విడదీసి చూపి రచనలను చేసిన రచయిత భరద్వాజ గారు. భరద్వాజ గారికి జ్ఞానపీఠ బహుమతి తెచ్చిపెట్టిన వారి "పాకుడు రాళ్ళు " నవల సినీమాయాలోకపు ప్రతిబింబం. వారి కథలను శ్రీ శ్రీ గారు..."అధోజగత్ సహోదరుల కథా సరిత్సాగరం అని అభివర్ణించారు. విస్తృతంగా రచనలు చేసిన భరద్వాజ గారు , సాహిత్య సృష్టికోసం , వ్యవస్థ మీద కసితోటి , కొత్త పంథా సృష్టించడం కోసం , సైన్స్ అందరికీ అర్థం కావడానికి , ఉద్యోగ ధర్మంగా , విధిలేక డబ్బుకోసం రచనలు చేశాను అని నిజాయితీగా చెప్పిన వ్యక్తి. ప్రస్తుతం మనం వినబోయే ఒక ఎలుక కథ....సంక్షేమ పథకాల పేరుతో , ప్రజలను బుట్టలో వేసుకుని , వారిని బిచ్చగాళ్లుగా మార్చేస్తున్న మన ప్రభుత్వాల తీరుని గుర్తుకు తెచ్చే కథ. ప్రభుత్వాన్ని కాదు అంటే ప్రజల గతి ఏమిటో తేల్చి చెప్పే కథ. వినండి, జ్ఞానపీఠ బహుమతి గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ గారి రచన " ఒక ఎలుక కథ ". 💐💐🙏 మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada Mail : [email protected]
Embed this episode
NOW PLAYING
జ్ఞానపీఠ బహుమతి గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ గారి రచన - " ఒక ఎలుక కథ ".
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.