EPISODE · Aug 10, 2019 · 16 MIN
"కాకి గూడు " రచయిత్రి శ్రీమతి ఎమ్ ఎస్ కె కృష్ణజ్యోతి
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
కధాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ "కాకి గూడు " రచయిత్రి శ్రీమతి ఎమ్ ఎస్ కె కృష్ణజ్యోతి. కృష్ణజ్యోతి గారు , కధలు రాయరు. చెప్తారు.ఒక ఆత్మీయ కుటుంబ సభ్యునితోనో , స్నేహితునితోనో మనం మన గోడు వెళ్లబోసుకున్నట్టు , చాలా సాదా సీదా భాషలో , ఏ అలంకారాలూ లేకుండా , నిరాడంబరంగా ఉంటాయి ఆమె కధలు . ఆమె కధల్లో పాత్రలు కూడా అంతే, ఏ గొప్పలు ఉండవు సరికదా , బాధని కడుపులో దాచుకుని బతికేసే పాత్రలు. అట్లాఅని పాత్రల కడుపులో బాధలు అలాగే ఉండనివ్వరు ఆమె , వారి తరఫున తాను మాట్లాడి వారి బాధను తన బాధగా/బాధ్యతగా తీసుకుని, రచయితగా మన మనసులోకి ఎక్కిస్తారు. ఆమె రచనల్లో అంతర్లీనంగా కనపడే ఆవేశం.....అన్యాయపు పద్దతుల్ని ఎదిరించాలి అనే ఆక్రోశం వల్ల వచ్చింది అని గ్రహించాలి. "కాకి గూడు " కధ చదివితే మనకి తప్పక అనిపిస్తుంది , సంసారాన్ని నిలబెట్టేది స్త్రీ మాత్రమే ! సాటి జీవి పట్ల కరుణ , మమకారం ......బంగారం కన్నా విలువైనవి అని....కధ ద్వారా రచయిత్రి చెప్పిన అంశం అయినా , లౌక్యంతో కూడిన మంచితనం ఆమెను ఆ ఇంటికి మహారాణిని చేస్తుంది.వృత్తి రీత్యా లెక్చరర్ అయిన ఆమె వద్ద పాఠాలు వినే విద్యార్థులు ఎంత,అదృష్టవంతులు , ఎంతగా ఉత్తేజితులు అవుతారు అని సంతోషం అనిపిస్తుంది....ఆమె .... చెప్పిన మానవత్వపు పాఠం ఏమిటో వినండి....."కాకి గూడు "కధ ద్వారా ! 💐🙏కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బాంక్ , విశాఖసాగరతీరం.
Embed this episode
NOW PLAYING
"కాకి గూడు " రచయిత్రి శ్రీమతి ఎమ్ ఎస్ కె కృష్ణజ్యోతి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.