EPISODE · Aug 2, 2019 · 9 MIN
"కానుక " రచయిత కీ. శే. ముళ్ళపూడి వెంకటరమణ
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
కథాభిమానులకు నమస్కారం. ఈ వారం (9.2.2019) మనం వినబోయే కథ "కానుక " రచయిత కీ. శే. ముళ్ళపూడి వెంకటరమణ గారు. ముళ్ళపూడి వారి పేరుతో బాటు వేరొకరి పేరు కలిపి ప్రస్తావించకుండా ఒక్క లైను కూడా ముందుకి కదలదు. ఆయన కీ. శే. బాపు గారు. బాపు-రమణలు స్నేహానికి అర్థం , నిర్వచనం చెప్పిన మహానుభావులు.రమణగారిది రాత....బాపు గారిది గీత.వారిని విడివిడిగా ఊహించుకోలేము.ముళ్ళపూడి వారిని హాస్య రచయితగా భావించినప్పటికీ , ఆయన మనసును కదిలించే రచనలు చేశారు.ముళ్ళపూడి వారి రచనల మీద ముత్యాలముగ్గు నిర్మాత ఎమ్.వీ ఎల్ గారు "కానుక " పేరుతో చిన్న పుస్తకం వెలువరించారు. ప్రస్తుత కథ కానుక విషయానికి వస్తే....ఇది మురళీ మోహన కృష్ణుడి కథ.వేణుగానానికి మనసు పారేసుకున్న ఒక వెర్రి గోపన్న కథ.మురళి కథ.మురళీ రవం అనగానే....ఎన్నో సినిమా పాటలు గుర్తొస్తాయి....అన్నిటికన్నా సప్తపది సినిమాలో వేటూరి వారి పాటలో "పిల్లనగ్రోవి కి ఒళ్లంత గాయాలే... అల్లన మ్రోవికి తాకితే గేయాలే " అన్న పంక్తులు గుర్తొస్తాయి.ఆపాటలో ఆవుల్ని తోలుకుంటూ వెళ్లే గోపబాలుడు కానుక కథలో కళ్ళ ముందు కదుల్తాడు. కథలో ఒక వెర్రి గోపన్న తాను చేసిన వెదురు వేణువులో మురళీ గాన మాధుర్యాన్ని పొదగాలి , ఆ వేణుమాధవుడికి దాన్ని కానుకగా అందచేయాలి అన్న ఒక పిచ్చి భ్రమలో వేయి వేణువులు తయారుచేసి గుట్టపోసి చివరికి ఏ వేణువులో మాధుర్యం ఒదిగిందో తెలుసుకోలేక తన కన్న బిడ్డని చిన్నారి కన్నయ్యగా రూపు దిద్ది , అతడి చేతికి మిగిలిన చిట్ట చివరి వేణువుని ఇచ్చి కృష్ణయ్య వద్దకు కృష్ణాష్టమి రోజు పంపుతాడు ......ఆతర్వాత ఏం జరిగింది....అతడి గుండెలో వేయి వేణువులు ఎలా ఆ మురళీ కృష్ణుడు మోగించాడు అనేది కథ విని తెలుసుకోండి. వినండి ఈ వారం కథ ముళ్ళపూడి వెంకటరమణ గారి "కానుక " . 💐💐🙏కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బాంక్ , విశాఖ సాగరతీరం.
Embed this episode
NOW PLAYING
"కానుక " రచయిత కీ. శే. ముళ్ళపూడి వెంకటరమణ
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.