"కాఫీ పెట్టవూ !" రచయిత్రి కిరణ్ విభావరి episode artwork

EPISODE · Jul 18, 2020 · 13 MIN

"కాఫీ పెట్టవూ !" రచయిత్రి కిరణ్ విభావరి

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం. 🙏ఈ వారం మనం వినబోయే కథ "కాఫీ పెట్టవూ !" రచయిత్రి కిరణ్ విభావరి. నేను సాధారణంగా కథ చదివి వినిపించడానికి ఎంచుకునేటప్పుడు వర్ధమాన రచయిత లేదా ప్రఖ్యాత రచయిత కథ అయినా కథలో కదిలించే గుణం ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటాను. ఆవిధంగా "కాఫీ పెట్టవూ " కథ నన్నే కాదు...వాట్సాప్ లో చదివినప్పుడు చాలా మందిని కదిలించింది. గతంలో నేను వినిపించిన , ప్రభాకర్ జైని గారి "సర్దుకున్నారా !" కథ లాగా ! కిరణ్ విభావరి సాహిత్య వనంలో ఇప్పుడిప్పుడే మొగ్గతొడుగుతున్న యువ రచయిత్రి. ఆమె సాహిత్యప్రయాణం సెప్టెంబర్ 2019 లో ప్రారంభించారు...ఇంకా ఏడాది కూడా కాలేదు. ఒక 30 కథల వరకూ రాశారు. కథ గురించి ప్రత్యేకించి చెప్పాలి అంటే తేలిక భాషలో రాసిన బరువైన కథ. ప్రధాన పాత్రల్లో ముగ్గురూ మంచి మనస్తత్వం ఉన్నవారు. కథ ముగించాక మనసుకి బాధ కలిగినా ఎవరినీ తప్పు ఎంచలేము. ఈ కథ లో రచయిత్రి.......మధ్య తరగతి కుటుంబాల్లో మనుషుల్లోని గుండె మూలల్లో ( గుండె లోతుల్లో కాదు ) దాగి ఉండే బాధ్యతల బరువు... ప్రేమ...స్వార్థం ఒక్కో నిముషంలో ఒక్కోటిగా చూపిస్తూ అంతా పావుగంటలో హ్యూమన్ సైకాలజీని మన ముందు పరిచారు . రచయిత్రి సైకాలజీ విద్యార్థిని కనుక పర్ఫెక్ట్ గా ఒక సామాన్య విషయాన్ని మనసుని కదిలించేలాగా ఆవిష్కరించగలిగారు అని భావిస్తున్నాను. వినండి ఈ వారం కథ "కాఫీ పెట్టవూ "💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు Retd Asst General Manager Indian Bank Vijayawada Ph 96770 15158 Mail ID [email protected]

Episode metadata supplied by the publisher feed · Published Jul 18, 2020

Embed this episode

NOW PLAYING

"కాఫీ పెట్టవూ !" రచయిత్రి కిరణ్ విభావరి

0:00 13:59

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 13 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on July 18, 2020.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!