EPISODE · Jul 23, 2019 · 17 MIN
కార్తికేయుని కీర్తి కాయం "కథ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
కధాభిమానులకు నమస్కారం.🙏 ఈ వారం మనం వినబోయే కథ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన " కార్తికేయుని కీర్తికాయం ". సినీ గేయ రచయిత సీతారామ శాస్త్రి గారు కధలుకూడా రాస్తారా అని ఆశ్చర్యపోయే మనకు ఈ కథ ఆయన రచన పత్రికకు 2000 సంవత్సరంలో రాశారు. ఈ కథ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో విశ్వపతి అనే పాత్ర మనకు కథ చివర్లో పరిచయం అవుతుంది. కథ కల్పితం అయినా వాస్తవానికి విశ్వపతి గారు కథలో కల్పితపాత్రగా ప్రవేశపెట్టబడినా ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ఆత్మీయమిత్రులు. నాకు కూడా పరిచయం. వృత్తిరీత్యా ఇంజినీర్,లోగో డిజైనర్ . కొన్ని వందల దేశ, విదేశీ కంపెనీలకు లోగోలు వేసి ఇచ్చిన వ్యక్తి. శ్రీ వెంకటేశ్వర స్వామిని అంకితభావంతో కొలిచే వ్యక్తి. అటువంటి వ్యక్తి కథలో ఒకానొక జీవన్మరణ సమస్యకు , పరిష్కారము, విశ్లేషణాత్మకం గా సూచిస్తారు. శ్రీ శ్రీ గారి సినిమా పాట "కల కానిది విలువైనది "సినిమా పాట విని ఒక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నాడు అనీ , ఆ పాట విలువ అదీ అని శ్రీ శ్రీ గారు ఒక సందర్భంలో అన్నారు.... ఈ కథకూడా ఆ కోవలోకే వస్తుంది.ఆత్మ హత్య పిరికివాళ్ళు చేసే పని అంటారు కానీ ,జీవించడానికన్నా ఆత్మహత్య చేసుకోడానికే ఎక్కువ ధైర్యం కావాలి అనిపిస్తుంది ఈ కథ వింటే ! "కార్తికేయుని కీర్తి కాయం "కథ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. 💐💐🙏కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బ్యాంక్ , విశాఖసాగరతీరం.
Embed this episode
NOW PLAYING
కార్తికేయుని కీర్తి కాయం "కథ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.