కీ. శే. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి "డు.. ము..వు..లు episode artwork

EPISODE · Jun 18, 2020 · 19 MIN

కీ. శే. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి "డు.. ము..వు..లు

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 🙏💐💐ఈ వారం మనం వినబోయే కథ కీ. శే. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి "డు.. ము..వు..లు ".ఈ నాలుగు అక్షరాలు విడి విడిగా చదవగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది....తెలుగు వ్యాకరణం లోని... విభక్తి ప్రత్యయాలు...వాటిలోని ప్రథమావిభక్తి . చిన్నప్పుడు అర్థం అయినా కాకపోయినా బట్టి పట్టిన అంశాల్లో విభక్తి ప్రత్యయాలు ఒకటి. వారం వారం కథకి పరిచయ వాక్యాలు రాస్తూ కృష్ణాతీరం నుండి కథాభిమానులకి....అంటూ మొదలెట్టే నాకు....మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి చిన్న నవల "కృష్ణాతీరం " గతవారం చేతికి వచ్చింది. అందులోని కథా...కథనమూ....భాషా...శైలి చదివి గత వారం రోజులుగా పులకరించిపోతున్నాను. అందువల్ల ...ఈ వారం ఆయన రాసిన కథల్లోంచి ఒకటి ఎంచుకుని చదవాలి అనిపించి....ఈ కథ ఎంచుకున్నాను. రామకృష్ణశాస్ట్రీ గారిది....అచ్చతెనుగు పలుకుబడి.జాను తెనుగు.ఈ కథ ఆంధ్ర మహాభారత రచనకు సంబంధించి చారిత్రక నేపధ్యంసృష్టించి అల్లిన కథ. కవి బ్రహ్మ తిక్కన సోమయాజి శాస్త్రిగారికి అభిమాన కవి. ఈ కథలో భారతాన్ని ఆంధ్రీకరించిన తిక్కన గారితో వారి సోదరుడు గురునాథుడు "ఒక్కరి కూటికీ గుడ్డకూ...అక్కరకొచ్చేది మీ బాస-మందిలో పడేది మా బాస "అంటాడు. ఈ కథలో శాస్త్రి గారు...సాహిత్యంలోనూ ..సంగీతంలో.....జాతి సంస్కృతి లో..రెండు మార్గాలుగా సాగే...శిష్ట -దేశి మార్గాలను రెండింటినీ సమన్వయ పరచుకొని సాగాలి అనే ఆలోచనతో ఈ కథ రాసినట్లు అనిపిస్తుంది. ఆయనది ఏ ప్రాంతపు మాండలికమూ కాదు. కేవలం తెలుగు. అచ్చ తెనుగు.చదివి వినిపించడానికి ...పలుకులకి లొంగే తెలుగు కాదు.అందువల్ల ఆయన జానుతనం తక్కువ ఉన్న కథ ఎంచుకున్నాను. వారి కథ...నవల...వ్యాసం ఏ వచన రచన చదివినా ...బాపూ రమణలు వారి కార్ట్యూనులు లో చెప్పినట్టు "ఓహో ! వచన రచనకు మేస్త్రి ! సాహా ! రామకృష్ణ శాస్త్రి ! "అనిపించక తప్పదు. నాలుగు రోజుల్లో ఈ నెల 17 వ తేదీ వారి జన్మదినం. వారికి మనః పూర్వకంగా నమస్సులు అర్పిస్తూ...ఈ వారం కథ "డు..ము..వు..లు." వినండి. 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada Phone 96770 15158. Mail [email protected]

Episode metadata supplied by the publisher feed · Published Jun 18, 2020

Embed this episode

NOW PLAYING

కీ. శే. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి "డు.. ము..వు..లు

0:00 19:33

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 19 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on June 18, 2020.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!