EPISODE · May 9, 2020 · 19 MIN
కళింగ ఆంధ్ర వారసుడు డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు కథ "దాలప్ప తీర్థం.
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏కరోనా లాక్డౌన్ రెండు వారాలు అనుకున్నది, రెండు నెలలకు చేరువ అవుతున్నది. ఒక మహమ్మారిపై ఓపికగా పోరాడుతున్న భారత ప్రజానీకాన్ని , కష్టకాలంలో వారికి అత్యవసర సేవలు అందిస్తున్నవారిని అభినందించాలి. మంచిరోజులు రానున్నాయి అని అందరం ఆశగా ఎదురుచూద్దాము. గత వారం ఉత్తరాంధ్ర మహాకవులు గురజాడ , శ్రీ శ్రీ గార్ల కథలు వినిపించాను. వారిని మాట వరసకు ఉత్తరాంధ్ర కవులు అనడమే కానీ వారిద్దరూ ఆధునిక తెలుగు సాహిత్యానికి దారి చూపించి, వెలుగులు నింపినవారు. అదే ప్రాంతంలోంచి ....భాషా పరంగా....భావ పరంగా...ఒక powerful రచయిత ఉన్నారు. ఆయన పేరు *డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు. ఈవారం మనం వినబోయే కథ వారి "దాలప్ప తీర్థం "* ఉత్తరాంధ్ర లో పుట్టి పెరిగి అక్కడి భాషని , యాసని శ్వాసగా నిలుపుకొన్న రచయిత. రావిశాస్త్రి గారికి వారసుడా... అనిపించేలా తొలి నాళ్ళలో రచనలు చేసినా , ఆయన ప్రభావంనుండి బయటపడి , సొంత గొంతుక వెతుక్కున్న ప్రతిభావంతుడైన రచయిత.వృత్తిరీత్యా జర్నలిస్ట్... మంచి కథా రచయిత. కళింగ ఆంధ్ర మాండలికానికి పట్టం కట్టిన వ్యక్తి.పాత్రికేయునిగా పని చేస్తూనే తను పుట్టిన నేలను ప్రేమిస్తూ అక్కడి మట్టి వాసనను... రచనల్లో గుబాళింప చేస్తున్న రచయిత. ప్రస్తుత కథ " దాలప్ప తీర్థం " విషయానికి వస్తే....అతి హేయమైన పాకీ పనివారి దుఃఖ భరితమైన జీవితాల్ని మన దృష్టికి ఒక మీడియా పర్సన్ లా కాకుండా..., శక్తివంతమైన కథకుడిగా మారి హృదయాలు ద్రవించేలా చెప్పిన కథ దాలప్ప తీర్థం. ఈ కథకు బాపూ గారు చిత్రించిన బొమ్మను చూస్తే....శ్రీ శ్రీ మహాప్రస్థాన గీతాలకు ఆయన వేసిన చిత్రాలు గుర్తొస్తాయి. రచయిత శ్రీనివాసరావు గారు విశాఖలో ఉండగా నాకు పరిచయం. వారి కథా సంపుటాలు మూడు 1. దాలప్ప తీర్థం 2. కాన్పుల దిబ్బ 3. కప్ప స్థంభం ఉన్నాయి. చిత్రంగా ఆ మూడింటిని ఆయన వరుసగా 1 శ్రీ చెరువు రామకోటయ్య 2 డాక్టర్ పైడి వెంకట రమణ మూర్తి 3 శ్రీ వి. హర్ష వర్ధన్ గార్లకు అంకితం ఇచ్చారు. ఈ ముగ్గురూ కూడా నాకు ఆత్మీయ మిత్రులు కావడం నాకు గొప్ప ఆనందం .వినండి... *కళింగ ఆంధ్ర వారసుడు డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు కథ "దాలప్ప తీర్థం." (రచయిత ఫోన్ నెంబర్ +91 88971 47067 )* 💐💐🙏 మీ కొప్పర్తి రాంబాబు Retd AGM Indian Bank Vijayawada Phone 96770 15158 Mail [email protected]
Embed this episode
NOW PLAYING
కళింగ ఆంధ్ర వారసుడు డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు కథ "దాలప్ప తీర్థం.
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.